ఆంధ్ర గాథాలహరి

తరుణి రోదన ( ఆంధ్రగాథాలహరి-68)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ధు అఇవ్వ మఅ కలంకం కవోలపడి అస్సమాణిణీ ఉ అహ
అణవర అవాహ జలభరి అణ అణ కలసేహిం చందస్స (విషమరాజు)
సంస్కృత చ్ఛాయ
ధావతీవ మృగ కలంకం కపోల పతితస్య మానినీ పశ్యత
అ నవరత భాష్ప జల భృత నయన కలశాభ్యాం చంద్రస్య
తెలుగు
తే.గీ: జవ్వని నయనములనుండి జాలువారు
బాష్పముల జూడ, చెక్కిటన్ ప్రతిఫలించు
చంద్రబింబములోని మచ్చను మరి మరి
క్షాళనము సేయురీతిగా కానిపించు
‘‘ఆమె కన్నులనుండి జాలువారే బాష్పధారలు, అద్దముల వంటి ఆమె చెక్కిళ్ళపై ప్రతిఫలించే చంద్రబింబంలోని మచ్చను కడుగుతున్నట్టుగా ఉంది’’ అని రోషంతో బాష్పపూరిత నయనాలతో నున్న నాయికను జూచి చమత్కరిస్తున్నాడు నాయకుడు.
వివరణ ఇది గొప్ప అందమైన ఊహ. నాయిక రోదనవేళ- నాయకుడి భావనాహేల. ఆమె కన్నులనుండి ధారాపాతంగా నీళ్ళు కారుతున్నాయి. అవి ఆమె చెక్కిళ్ళమీదుగా జారుతున్నాయి. ఆ జారుతున్న కన్నీళ్ళు ఆమె చెంపపై ప్రతిఫలించే చంద్రునిలోని మచ్చను కడుగుతున్నట్టుగా భావిస్తున్నాడు నాయకుడు. అంతగా ఏడుస్తున్న నాయికను ఓదార్చకుండా, చంద్రుడు, మచ్చ అంటూ భావనాలోకంలో విహరిస్తున్న నాయకుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి.?సందర్భశుద్ధి లేని భావనాబలం శోభనివ్వదు అని అనుకుందామా అంటే అదీ వీలులేదు. లలనామణు లందరూ అందం అంటే ప్రీతికలవారే ఏడ్వడంలోను అందంగా ఉన్నావని, ఎంతగా కందిపోయందో నీమోము అని అనగానే వెంటనే ఏడుపు మాని అద్దంలో వారి సుకుమార మోమును చూసుకొంటారు. ఈనాయకుడు ఆడవారి మనసును బాగా తెలుసున్నట్టున్నాడు. ఇలాంటివాళ్లూ ఉంటారని గాధాకారుడు చెబుతున్నాడు. - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949