ఆంధ్ర గాథాలహరి

ఓ రాత్రీ! తెలవారనీకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
కల్లం కిర ఖరహి అఓ అపవసి ఇహి పిఓత్తి సుణ్ణ ఇ జణమ్మి
తవ వడ్ధ భ అవఇణిసే జహసే కల్లం వి అణహోణ!! (నిప్పటుడు)
సంస్కృత ఛాయ
కల్యం కిల ఖరహృదయః ప్రవత్స్యతి ఇతిశ్రూయతే జనే
తథా వర్థ్థస్వ భగవతి నిశే! యథాతస్య కల్యమేవన భవతి
తెలుగు
తే.గీ నన్ను విరహాంధకారమున బడవేయు
ధవుని పయనమ్ము, రేపని, చెవినిబడియె
రేలతాంగి! నీవత్యంత వృద్ధి చెంది
భానుడుదయింపలేనట్లు పరచుకొమ్మ!
భర్త తెల్లవారితే దూరదేశానికి వెళ్తున్నాడని ఆమెకు తెలిసింది. ఆమె రాత్రి కన్యను ఈ విధంగా అమాయకంగా వేడుకొంటోంది- ఓ నిశీధి కన్యకా! రేపు తెల్లవారలేనంతగా నీవు వృద్ధి చెందు!’’’ భర్తను విడిచి ఉండలేని స్ర్తిలు చంద్రుడిని వేడుకోవడం అనాదిగా వస్తున్నదే అనిపిస్తుంది.
కొన్నాళ్ల క్రితం సుమతి అనే పతివ్రత తన మగడి కోరికను తీర్చడానికి ఓ వేశ్య ఇంటికి కుష్టురోగం వచ్చిన మగడిని బుట్టలో పెట్టుకుని తీసుకొని వెళ్తున్నదట. దారిలో ఎత్తుపల్లాలకు ఆమె నడకకు ఇబ్బంది కలుగుతున్నా ఎంతో జాగ్రత్తగా తీసుకొని వెళ్లున్నదట. కాని మార్గమధ్యంలో ఒక ఋషి కూర్చుని తపస్సు చేసుకొంటున్నాడట. ఆయనకు ఈ సుమతి భర్త తగిలి తపస్సుకు భంగం కలిగిందట. అంతే ఆయన సంయమం కోల్పోయ సూర్యోదయం అవగానే తపోభంగం కలిగించిన ఈతని తల పగిలి మరణించుగాక అని శపించాడట.
అంతే ఆ తల్లి తల్లడిల్లిపోయంది. ఎంతటి ఓర్పుతోనో, ఎంతో భక్తితోనో తన మగనికి సేవలు చేసే ఆ తల్లి ఈ శాపంతో కోపం తెచ్చుకుంది. అంతే సూర్యుణ్ణే రావద్దు పొమ్మంది. చంద్రుడిని నిలబడమని అంద ట. అంతే చంద్రుడు నిలిచాడు. సూర్యుడు రాలేదు. లోకాలన్నీ ఈ చర్యతో అల లకల్లోలం జరిగాయ. ఆ తరువాత ఆ తల్లి దయతో సూర్యోదయం అయందనుకోండి.
కాని ఇక్కడ భర్తపై భార్యకున్న అనురాగ మెంతటిదో చూడాలి. భారతీయంలో పెళ్లి అంటే నూరేళ్ల పంట దాంపత్యం అంటే ఇద్దరు వ్యక్తులు కలసి ఒకటి అయ్యే సందరభం. వారిధ్దరి అప్పటి దాకా ముఖాలు చూసుకొని ఉండకపోవచ్చు. గాక. కాని, నేటి నుంచివారిద్దరూ భార్యాభర్తలు ఒకటే ఆత్మ గలవారుఅవుతారు. కనుక నేటి కాలంలో భార్యభర్తలు అయన వారు కాబోయేవారు ఇధ్దరూ ఒకరికి ఒకరుగాఉండాలని ఒకేఆత్మగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని, దాంపత్యధర్మానికి వారథులు కావాలని ప్రతిన పూనండి. - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949