ఆంధ్ర గాథాలహరి

మనస్సు హిమనగమే(ఆంధ్రగాథాలహరి-70)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ఆ.వె
అరుణడస్తమించు తరుణమందున గూడ
ఊర్థ్వగతిని కాంతి నొసగుచుండు
అటులె కష్టమందునైన, మానధనుని
హృదయసీమ తుంగ హిమనగంబు
సూర్యుడు అస్త్రాద్రిని చేరుతున్న సమయంలో కూడా కాంతిని పైకే విరజిమ్ముతూ ఉంటాడు. అట్లే మానధనుడైనవాడు కష్ట సమయంలో కూడా ఉన్నతంగానే ఉంటాడని నాయకుని గొప్పతనాన్ని నాయికకతో చెపుతోంది దూతిక.
వివరణ
అనేకమంది వీరయోధుల గాథలు, దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల కథలు, ఈ గాథను చదువుతూంటే గుర్తుకురావటంలేదూ! ‘వందేమాతరం!’ అంటూ ఉరికంబానె్నక్కిన భరతమాత ముద్దుబిడ్డలు, లాఠీదెబ్బలు తింటూ కూడా త్రివర్ణ పతాకను క్రిందపడనీయని ధీరోదాత్తులు ఈ గాథకు ఉదాహరణలే! కష్టాలను సహించే ఈ లక్షణానే్న ‘దమము’ అంటారు. కరిగిపోతూ కూడా కొవ్వొత్తి వెలుగునిస్తుంది. మంచి గంథపు చెక్క కాలుతూ కూడా సుగంధానే్న వెదజల్లుతుంది. అలాగే ఉత్తములు కష్టాల్లో కూడా పరోపకారానికే ప్రాధాన్యతనిస్తారు.
ప్రాకృతమూలం
తుంగోచ్చి అ హాఇ మణో మణం సిణో అంతిమాసు విదసాసు అత్థమణమ్మి విరఇణో కిరణా ఉద్ధం చి అ పురంతి (మాతృరాజు)

సంస్కృత చ్ఛాయ
తుంగమేవ భవతి మనో మనస్వినోం తి మాస్వపి దశాసు
అస్తమనేపి రవేః కిరణా ఊర్థ్వమేవ స్ఫురంతి - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949