ఆంధ్ర గాథాలహరి

నన్ను పట్టుకో... చూద్దాం.( ఆంధ్రగాథాలహరి-71)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ధావఇ విఅలి అధమ్మిగిల్ల సిచ అసంజ మణవా వడ కరగ్గా!
చందిలభ అవివలా అంతడింభ పరిమగ్గిణీ ఘరిణీ (మాతృరాజు)
సంస్కృత చ్ఛాయ
ధావతి విగలిత ధమ్మిల్ల సిచయ సంయమన వ్యాపృతకరాగ్రా
చందిల భయ విపలాయ మానడింభ పరిమార్గిణీ గృహిణీ!
తెలుగు
తే.గీ
క్షురకునింగాంచి, కొమరుండు పరుగులెత్త
పంతమానియు వానిని పట్టి తేగ
కొప్పు ముడివీడి రొప్పుచు, కొంగుజార
చూడు! మా చేడె పరుగిడుచున్నదదిగో
ఇదో హాస్యరస సన్నివేశం. పిల్లలు సహజంగా తలంటికీ, తల పనికీ ఒక పట్టాన రారు. వారిని తల్లులో, తండ్రులో పట్టుకొచ్చి బలవంతంగా క్షురకుని ముందు కూర్చోబెడుతూ ఉంటారు. ఈ గాథలో ఒక పిల్లవాడు క్షురకుని ముందు కూర్చోవడానికి భయపడి పరుగెత్తుతూ ఉంటే, వాడి వెనుక అతని తల్లి కొప్పు వీడినా, కొంగు జారినా పట్టించుకోకుండా పరుగెడుతోంది, చూడు అని ఇద్దరు మగువలు చెప్పుకుంటున్నారు.
వివరణ
నాడైనా, నేడైనా పిల్లలు పిల్లలే! ‘నయనము పాలుంద్రావరు’ అనేది ఉండనే ఉంది కదా! నాటి దృశ్యం అదైతే- ‘స్కూలుకు పోనని మారం చేసే కొడుకును బుజ్జగిస్తూ, బ్రతిమలాడుతున్న తల్లి’, ‘సెల్‌ఫోన్ కోసం, టీవీ రిమోట్ కోసం అమితంగా అల్లరి చేసే చిట్టితల్లి’- ఇవే నేటి దృశ్యాలు. ఇదే కదా కాల మార్పు... చిన్న పిల్లల అల్లరి అల్లరియే సుమా! - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949