ఆంధ్ర గాథాలహరి

లెక్కపెట్టడం ఎలా? (ఆంధ్రగాథాలహరి-72)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
హత్థేసు అపాఏసు అ అంగుళిగణణాఇ అ ఇగఆదిఅహో
ఏణ్హిం ఉణకేణ గణిజ్జఉ త్త్భిణేఉ రూ అఇ ముద్ధా (పాలితుడు)
సంస్కృత చ్ఛాయ
హస్తయోశ్చ పాదయోశ్చాంగుళి గణన యాతిగతా దివసాః
ఇదానీం పునఃకేన గణ్యతామితి భణిత్వా రోదితి ముగ్ధా
ఆ.వె
కాళ్ళు చేతులకును గల్గిన వ్రేళ్ళతో
నీదురాక కొరకు నెంచుచుంటి
ఇంక వేనితోడ నికపైన లెక్కింతు
ననియు, పొరలి పొరలి వనిత ఏడ్చె
భావం: నీవెప్పుడొస్తావా! అని చేతులకు కాళ్ళకు గలిగిన వ్రేళ్ళతో లెక్కిస్తూ వచ్చాను. ఈ రోజుతో అవి కూడా అయిపోయాయి. ఇంక వేటితో లెక్కించాలి!’’ ఇకనైనా తొందరగా రమ్మని ప్రవాసంలో వున్న ప్రియునికి దూత ద్వారా సందేశం పంపిస్తోంది నాయిక ఈ గాథలో.
వివరణ
ప్రయాణ, ప్రసార సాధనాలు లేని రోజుల్లో, ఎప్పుడు వస్తాడో తెలియని మగనికోసం కాళ్ళు చేతులకున్న వ్రేళ్ళను లెక్కపెట్టుకోవడం కాక మరేం చేయగలరు మగువలు. సందేశాలు పంపడానికి వీరేమీ సంపన్నులు కాదే! పరమ సామాన్యులు. అందువల్ల అశక్తురాలైన ఆ వనిత చేసేదేమీ లేక ఏడ్చిందని చెపుతున్నాడు గాథాకారుడు. ఆకాలంలో ఏడుపు ఒక్కటే సర్వరోగ నివారిణి అని కాదు దీనర్థం మనసుతో తనకు ఎంత వేదనగా ఉందో తెలియబర్చడానికి కళ్లనుంచి కన్నీరు కార్చి మరీ సందేశాన్ని పంపింది. ఆసందేశాన్ని అందుకునే ప్రియుడు ఆమెకు వెంటనే స్వస్థతకలిగించే సందేశం పంపస్తాడనే ఆశతో. ఇప్పటికాలంలోను ఏ ఆధునికత జోలికి పోకుండానే మనసే కొన్ని సందేశాలను ఇస్తుందికదా. మరీ ఇటువంటి సన్నివేశాల్లో ఇది అనుభవైకవేద్యమే కాని వర్ణించడానికి వీలులేనిది ఏమంటారు! - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949