ఆంధ్ర గాథాలహరి

గంధం పన్నీరైంది( ఆంధ్రగాథాలహరి-74)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు
తే.గీ గంధ చూర్ణము చేదాల్చి కెలికియొకతె
హోలియని వానిపై జల్ల నురుకుచుండ
చిత్తహరు జూచి, చేతులు చెమ్మగిల్ల
గంధపంకమున్ ప్రియునిపై కలయజల్లె
అది హోళీ సరంభం. ప్రియునిపై చల్లడానికని గంధపు పొడిని చేతిలో తీసికొని బయలుదేరింది. తీరా ప్రియుడు కనిపించేసరికి సిగ్గుతో చేతులు చెమ్మగిల్లాయి. గంధపు పొడి, గంధపు పూతగా మారింది. దానినే కళ్ళు మూసుకొని ఆమె ప్రియునిపై చల్లింది.
వివరణ
అతిశయోక్తికి అంతులేదనడానికి ఈ గాథ ఉదాహరణ. గంధపు పొడి నాయిక చేతుల్లోని చెమటతో తడిసి, ప్రియుని మీద చల్లేంత బురదగా మారిందని చెప్పడం అతిశయోక్తి కాక మరేమిటి. నాయిక మనస్సులో జనించిన వలపు తలపు చిరు చెమటకు కారణమవడం స్వభావ సిద్ధం. అది గంధపు పంకంగా మారడం ధ్వని.
ప్రాకృతమూలం
ఘే త్తూణ చుణ్ణ ము ట్ఠిం హరిసూససి ఆఏ వేపమాణా ఏ భిసిణే మిత్తి పి అఅమం హత్థే గంధోద అం జా అం (కాంతఫరుడు)
సంస్కృత ఛ్ఛాయ
గృహీత్వా చూర్ణ ముష్టింహా- ర్షోత్సుకి తాయావేపమా నాయాః
అవకిరా మీతి ప్రియతమం హస్తే గంధోదకం జాతం - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949