ఆంధ్ర గాథాలహరి

ఆంధ్రగాథాలహరి -- 75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచడం ఎలా?
==========

తే.గీ మనసు దోచిన చెలికాడు కనపడంగ
చేతులతో నాదు కనుల మూసితినిగాని
పూచిన కదంబ వృక్షంబు వోలెనున్న
తనువుపైగల పులకల దాచగలనె
‘‘ఏమిటో, వాడు కనపడగానే నాకు ఎక్కడలేని సిగ్గూ ఆవరిస్తుంది. అప్రయత్నంగా రెండు చేతులతో కన్నులు మూసుకుంటాను. కళ్ళయితే మూసుకున్నానుగానీ, పూచిన కడిమి చెట్టులాగా తనువంతా ఉన్న పులకల నెట్లు దాచగలనే చెలీ!’’ అని దూతికతో నాయిక చెపుతోంది.
వివరణ
మనసులో కలిగిన భావాలు ముఖంపై ప్రతిఫలిస్తాయి. తనువంతా ఆవరిస్తాయి. సంతోషము, దుఃఖ, ఉత్సాహము, ఉద్వేగము దాస్తే దాగేవి కావు. ఎంత దాచాలనుకున్నా దుఃఖంలో ఉన్నవాడి నవ్వు వెఱ్ఱి నవ్వే అవుతుంది. ఎంత గంభీర వదనుడైనా సంతోషంతో ఉంటే ముఖం వెలిగిపోతూంటుంది. అందువల్ల అంతరంగం దాస్తే దాగేది కాదు. ఈ గాథలోని భావం తదనంతరకాలంలో అమరుకుడనే సంస్కృత కవి కావ్యంలోనూ కనిపిస్తుంది.
ప్రాకృతమూలం
అచ్ఛీ ఇ తాథ ఇస్సందోహి విహత్థే హివి తస్సింది దిట్ఠే అంగం కలంబ కుసుమం వపుల ఇఅం కహణు ఢక్కిస్సం (సస్సీహుడు)
సంస్కృత చ్ఛాయ
అక్షిణీతావత్ స్థగయిష్యామి ద్వాభ్యామపి హస్త్భ్యాం తస్మిన్ దృష్టే
అంగం కదంబ కుసుమ మివపులకితం కథం నుచ్ఛాదయిష్యామి

- ఇంకావుంది..

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949