ఆంధ్ర గాథాలహరి

నిధి కోసం వేట( ఆంధ్రగాథాలహరి-76)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ
కలుసుకొనెడు చోటు కనరాక, మదిలోన
కలత చెందినట్టి నెలత చూడు!
వెదకుచుండెన్ని వెదురు పొదలలోన
నిధుల మూట కొరకు నెమకినట్లు
ఒక ప్రేమికుల జంట ఫలానా చోట కలుసుకుందామనుకున్నారు. ఆమె వచ్చి సంకేత స్థలాన్ని మరచిపోయి ప్రియునికోసం అన్ని వెదురుపొదల్లోనూ వెదుకుతోందట. ఆమె వెతుకులాట చూస్తూంటే ఏదో పోగొట్టుకున్న నిధికోసం వెతుకుతున్నట్టుగా ఉందని చమత్కరిస్తున్నాడు గాథాకారుడు.
వివరణ: వెతుక్కునే వాడికి కలవరంగా ఉన్నా చూచేవాడికి మాత్రం ఆ ఆరాటం సరదాగా ఉంటుంది. నేటి పార్కుల్లో ఈ దృశ్యం సర్వసాధారణం. ఈ చాటుమాటు ఆరాటాలు చేటు చేస్తాయనేది మాత్రం చేదు నిజం.
మన భారతీయం సగం మూసి సగం తెరిచి ఉండమని అదే మన ఆచారం అని చెప్పింది. మూసి ఉన్నది తెలుసుకో వాలన్న ఆరాటం ఉంటుం ది. అది సహజమే. దాని కోసం అడ్డదారులు తొక్కు తానంటే అది అరిష్టానే్న కలుగుచేస్తుంది అన్నది గాధాకారుడు అపుడు చెప్పినా ఇప్పటికీ వేదాక్షరమే.
ప్రాకృతమూలం
అహ సా తహిం తహింవ్విఅ వాణీరవణమ్మి చుక్క సంకే ఆ
తుహదంసణం విమగ్గఇ పబ్భట్ఠణి హాణ ఠాణంవ
సంస్కృత చ్ఛాయ
అథ సా తత్ర తత్రైవ వానీరవనే విస్మృత సంకేతా
తవ దర్శనం విమార్గతి ప్రభ్రష్ట నిధాన స్థానమివ - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949