ఆంధ్ర గాథాలహరి

కమలము - సూర్యుడు -81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె వానిమీద నాకు, వలపు లేదందువు
వాని పేరు చెవిని బడినయంత
అర్కుని బొడగన్న అంభోరుహమువోలె
నివ్వటిల్లునేమి? నీదు ముఖము
‘‘వాడిమీద నాకు అసలు ప్రేమే లేదంటావే, గానీ వాడి పేరు చెప్తే చాలు, సూర్యుణ్ణి చూచిన కమలంలా నీ ముఖం వికసిస్తోంది. ఎందుచేతనే చెలీ?’’ అని నాయికను ప్రశ్నిస్తోంది.
వివరణ: ‘ఔనంటే కాదనిలే / కాదంటె ఔననిలే /ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ అంటాడో సినీ కవి. అలా నాకు ప్రేమే లేదని బుకాయిస్తున్న నాయికను నిలదీస్తున్నదో దోస్తుల గాథే ఇది. వాడిమీద ప్రేమే లేకుంటే వాణ్ణి చూడగానే నీ ముఖంలో ఆ మెరుపేమిటి? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు వారు.
మనుషులు మాటలతో బురిడీలు కొట్టగలుగు తారు. మనసును దాచిపెట్టగలుగుతారు. కానీ కళ్లు మాత్రం వారి అసలు నైజాన్ని చెప్పక చెబుతూనే ఉంటాయ. ప్రియుణ్ణి చూడడం ప్రియురాలికి ఎంత ఇష్టమో ఎవరైనా చెప్పాలా? ఆమె ముఖం చెప్పదా... అందుకే ఈ చెలి తన సఖి ప్రేమ వృత్తాంతం తెలిసింది ఆమె మనసు తెలిసింది కనుక సఖి నాయక ఎంత కాదు కాదు అని చెప్తున్నా మాట వినక ఆ మె చూపులను పసికట్టి, ఆమె మోము హోయలు పోయే తీరు గమనించి అబ్బో లేదు లేదు అంటూనే అసలు సంగతి నీ కనులు చెప్పాయలే అంటూ ఎంత చక్కని ఉపమానం చెప్పిందంటే సూర్యుణ్ణి చూసిన కమలం విచ్చుకోకుండా ఎలా ఉండగలదో అట్లానే నీ ప్రియుని పేరు చెప్పినా నీ హృదయం విహంగమై ఎగురుతోంది అది అంతా నీ ముఖారవిందంలోనే తెలుస్తోంది అని అంటున్నది. ఇదంతా సహజ పరిణామాలే. ప్రతివారికి అనుభవైక వేద్యాలే.
ప్రాకృతమూలం
జ ఇ సోణ వల్ల హోవ్వి అగోత్తగ్గ హణేణ తస్ససహికీస
హాయి ముహం తే రవి అరఫం సవ్వి సదం వతామరసమ్ (సుశీలుడు)
సంస్కృత ఛ్చాయ
యది సనవల్లభ ఏవ గోత్రగ్రహణేన తస్య సఖి కిమితి భవతి ముఖం తవ రవికర స్పర్శ వికసితమివ తామరసమ్ ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949