ఆంధ్ర గాథాలహరి

నీవుండే క్షణాలే -85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ఏహిసి తుమంత్తిణి మిసం వ జగ్గిఅం జామిణీఅ పడమద్దం సేసం సంతావ పరవ్యసా ఇవరిసంవవో లీణం (అల్లడు)
సంస్కృత చ్ఛాయ
ఏష్యసి త్వమితి నిమిషమివ జాగరితం యామిన్యాః ప్రథమార్థమ్
శేషం సంతాప పరవశాయ వర్షమివ వ్యతిక్రాంతమ్
ఆ.వె నిన్నరాత్రి సగము నీవు వచ్చెదవంచు
నీదు చెలికి గడచె నిమిషమట్లు
నీవు రాని కతన నిబిడవౌ విరహాన
వత్సరంబువోలె పరగెసగము
‘‘ఆమె, నీవు వస్తావనే ఆశతో రాత్రి సగభాగాన్ని నిమిషంలాగా గడిపేసింది. అర్థరాత్రి దాటేసరికి నీవు రావని తెలిసి విరహంతో బాధపడుతూ, ఆ సగం రాత్రినీ సంవత్సరంలా గడిపేసింది’’ అని నాయిక విరహవేదనను దూతిక నాయకునికి తెలియజేస్తోంది.
వివరణ: ‘నీవు నా పక్కనుంటే హాయి / నీవు లేకుంటే చీకటి రేయి’ అంటాడో సినీ కవి. అంటే ఇష్టమైన వాళ్ళు వెంట ఉంటే రోజులు, సంవత్సరాలు క్షణాల్లాగా గడిచిపోతాయి. దీనికి ఉదాహరణ శ్రీమద్రామాయణమే. శ్రీరామునికి పదునాలుగేళ్ళ అరణ్యవాసంలో పదమూడు సంవత్సరాలు హాయిగా గడిచిపోయాయి. చివరి సంవత్సరంలోనే రావణుడు సీతను ఎత్తుకుపోవడం, రావణ సంహారం ఇత్యాది ఘటనలన్నీ జరిగాయి. అందువల్ల సీతమ్మ చెంత లేకపోవడంవల్ల శ్రీరామునికి ఆ వత్సర కాలం ఎలా గడిచిందో మనకు తెలియంది కాదు. రాముడంతటివాడే సీత కోసం పదేపదే దుఃఖించాడు. చెట్లను పుట్లను నా సీతను చూశారా అని అడిగాడు. గోపికలూ అంతే వారి మనోభిరాముడు మనసు దోచిన శ్యాముడు అయన కృష్ణయ్యను మరవలేక ఆ కన్నయ్యను విడిచి ఉండలేక
నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై
జల్లెడువాడు వౌళిసరిసర్పిత ఫించము వాడు నవ్వురా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలారా! మీపొదలమాటున లేడు గదమ్మ చెప్పరే!
అట్లా అడుగుతూ వారు కొడిసెవృక్షాలను, మద్దితరువులను,మాదీఫల తరువులను, నారింజ చెట్లను, లవంగవృక్షాలను కంకేళిపాదపములను, సంపెగలను, ఎర్రగోరింటలను, మొల్లలను, ఇలా సృష్టిలో ఉంటే వస్తువులను అవస్తువులను కూడా అడిగారు. అంటే వారి ప్రేమ ఎంత ఉన్నతమో కదా.

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949