ఆంధ్ర గాథాలహరి

పిండిమహాలక్ష్మి-86

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె పిండి దంచు, రైతు పిల్లకు మేనెల్ల
పిండియలము కొనగ, విహిత జలధి
మథనమున వెలసిన, మహాలక్ష్మిగానెంచి
కన్నులార్పకుండ, కనిరి జనులు
ఒక రైతు పిల్ల బియ్యపు పిండి దంచుతోందట. ఆపాదమస్తకమూ ఆ పిండి పడడంవల్ల ఆ పిల్ల ఒళ్ళంతా తెల్లని రంగు వేసినట్లు మెరిసిపోతోందట. ఆ దృశ్యాన్ని చూచినవారికి, పాల సముద్రాన్ని మధించే వేళలో జనించిన లక్ష్మీదేవిలా ఆ పిల్ల అలరారుతోందని కన్నులార్పకుండా చూచారట. ఇది సురభి వత్సుడు అనేగాథాకారుడి చమత్కారభరితమైన కథనం.
వివరణ:క్రీ.శ. ఒకటవ శతాబ్దంనాటికే భారత, భాగవత గాథలు జన సామాన్యం మనసుల్లోకి ఎలా ఇంకిపోయాయో ఈ గాథ తెలియజేస్తుంది. అందుకే అన్నారు భావములోన రాగములోన అని మనం వూహించేదాన్ని బట్టే ఎదురుగా ఉన్నది బంగారమో , మట్టిముద్దనో తెలుస్తుంది. ఈ పిండి పూసుకున్న పిల్లనే బూడిద పూసుకొన్నట్టు ఉంది ఛీ అంటే ఛీ నే కాదు మహాలక్ష్మీ లా ఉంది అంటే మహాలక్ష్మినే . ముద్దుగా బొద్దుగా అల్లరి చేసే చిన్నపిల్లలందరూ మనకళ్ళకు బాలకృష్ణులే. కళగా వున్న కనె్నపిల్లలందరూ మహాలక్ష్ములే. రోళ్ళు, రోకళ్ళు తెలియని నేటి కాలంలో ‘మిక్సీలోంచి పిండి ఎలా ఎగిరిపడుతుంది, మమీ!’ అని పిల్లలు అడిగినా ఆశ్చర్లేదు. కానీ ఆడపిల్లలను మహాలక్ష్మీ స్వరూపాలుగా భావించే నాటి సామాజిక జీవనం మళ్లీ రావాలని ఆకాంక్షిద్దాం.
ప్రాకృతమూలం
పేచ్ఛంతి అణిమి సచ్ఛా పహిఆ హలి అస్స పిట్ఠ పండురిఅం
ధూ అం దుద్ద సముద్దుత్తరంత లచ్ఛివి అస అహ్ణా! (సురభివత్సుడు)
సంస్కృత ఛాయ
ప్రేంతే నిమిషాక్షాః పధికాహలి కస్య పిష్ట పాండురితామ్
దుహితరం దుగ్థ సముద్రోత్తర లక్ష్మీ మివ సతృష్ణాః!

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949