ఆంధ్ర గాథాలహరి

చక్రి పాదమునకు శరణమనుడు -92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె ఆ సురేంద్రుగావ, అసురేంద్రుయాచించి
ఆకసంబునందు ‘అడుగు’గొల్చి
చుక్కలనెడు పూల చక్కగాన తిగొన్న
చక్రిపాదమునకు శరణమనుడు
-ఇది ఒక భాగవత సంబంధమైన గాథ. వామనావతార ఘట్టం. ఇంద్రుణ్ణి రక్షించడానికి వామనుడై బలిని మూడడుగుల నేల యాచించి భూమ్యాకాశాలను తన పాదాలతో కొలిచాడు హరి. ఆకాశాన్నికొలిచే వేళ, హరి పాదమును కనుగొని, తన తండ్రి పాదముగా నెరింగి, బ్రహ్మ తన కమండలంలోని జలంతో కడగడం మనకందరకూ తెలిసిందే! ఆ సమయంలో ఆకాశంలోని చుక్కలనే పూలతో కూడా శ్రీహరి పాదం పూజింపబడిందని ఈ గాథలోని చమత్కారం. అట్టి మహత్తరమైన హరి పాదమునకు వినమ్రులై నమస్కరించమని చెపుతున్నాడు గాథాకారుడు.
ఈ గాథను చదువుతూంటే పోతనగారి ‘ఇంతింతై వటుడింతై’ అన్న పద్యమూ, అన్నమాచార్యులవారి ‘బ్రహ్మ కడిగిన పాదము’ అనే కీర్తనా గుర్తురాక మానవు. పోతనా మాత్యుని భాగవత పద్యాలు పండితులకైనా, పామరులకైనా రసరమ్యంగా ఉంటాయ కదా. అందులోను గాధాకారుడి మనసు పోతన పద్యాలు ఆకట్టుకొన కుండా ఎలా ఉంటాయ. అంతేకాదు ప్రతి రచనలో అన్యాపదేశం గానైనా సరే మన భారత భాగవతరామాయణాల స్పర్శ ఉంటూనే ఉంటుంది. ఇది సహజమే అనిపిస్తుందికూడా. హాస్యానికైనా, చమత్కారానికైనా , ఆధ్యాత్మికంగా ఎదగడానికైనా పోతన పద్యాలు అందరికీ అనుభవైకవేద్యాలు.
ప్రాకృతమూలం
అపహుప్పంతం మహిమండలమ్మి ణహసంఠి అంచిరంహరిణో
తారాపుప్ఫప్ప అరంచి అం వతఇఅంప అంణమహ (ఉయహియుడు)
సంస్కృత చ్ఛాయ
అప్రభవన్ మహామండలే నభస్సంస్థితం చిరంహరేః
తారా పుష్పప్రకరాంచిత మివతృతీయం పదం నమత
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949