ఆంధ్ర గాథాలహరి

ఎండవేడిమా! అదెక్కడ? -88

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె
ముద్దుగొలుపు ముదిత ముఖ చంద్రచంద్రికా
శీతఝరులు, మదిని చెలగుచుండ
మాడ్చు మండు టెండ, మధ్యాహ్నవేళలో
వెడలు, పాంధునెట్లు వెతలు పెట్టు
మనస్సులో ప్రియురాలి ముఖమనే చంద్రబింబంనుండి జాలువారే చల్లని ప్రవాహాలుండటంవల్ల ఆ బాటసారికి ఉష్ణతాపం తెలియడంలేదట. మండుటెండలో కులాసాగా నడచి వెళుతున్న ఒక బాటసారిని గూర్చిన చమత్కార భరితమైన గాథ ఇది.
వివరణ:మనస్సులో సంతోషం ఆవరించి ఉన్నపుడు ఎండ, గాలి, చలి ఇవేవీ అనిపించవు. వాటి తీవ్రత అనుభవంలోకి రాదు. అంతా మనసులోనే ఉందేమోననిపిస్తుంది. కొంతమంది చిన్న కష్టానికే బెంబేలెత్తిపోతారు. మరికొంతమంది బండెడు కష్టాలు ముసురుకున్నా తొణకరు, బెణకరు. కారణం వారు మానసికంగా బలవంతులవడమే.
అందుకే ముందు మనసును బలవత్తరం చేసుకోవాలి. దానినిండా శుభంకరాలైన విషయాలను నింపుకోవాలి. అంతా మంచి జరగాలని, ప్రేమనిండిన మనస్సుతో ఆలోచనలు చేస్తే ప్రేమను పంచుతూ ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటే జగమంతా ప్రేమమయంగా కనిపిస్తుంది.
ప్రాకృతమూలం
మజ్ఘ హ్ణ పత్థి అస్స విగిమ్హే పహి అస్స హరఇ సంతావం
హిఅ అట్ఠి అజా ఆముహమ అంకజోహ్ణా జలప్ప వహో (మంగలకలసుడు)

సంస్కృత చ్ఛాయ
మధ్యాహ్న ప్రస్థితా స్యాపి గ్రీష్మే పథికస్య హరతి సంతాపం
హృదయస్థిత జాయా ముఖ మృగాంక జ్యోత్సాన జలప్రవాహః

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949