ఆంధ్ర గాథాలహరి

అంతరాత్మయే సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
హేమంతి ఆసు అఇ దీహరాసురాఈసు తంసి అవిణద్దా
చిర అరప ఉత్థవ ఇఏణ
సుందరం జది ఆసువసి (కంతేశ్వరుడు
సంస్కృత ఛాయ
హైమంతికాస్వతి దీర్ఘాసు రాత్రిషు త్వమస్యవినిద్రా
చిరతర పోషిత ప్రతికే నసుందరం యద్దివా స్వపిషి
తెలుగు
తే.గీ
పగలు నిద్రించుచుండుట, పరులుగాంచి
చిలువ పలువలు గల్పించి చెవులు గొరుక
అత్త గమనించి అడుగగా అనియెనిట్లు
‘అన్యులేమన్ననేమి? నాకాత్మసాక్షి’

రాత్రిపూట, మగని ఆలోచనలతో సతమతమవుతూ పగలు నిద్రపోయే పడతిని గూర్చి లోకులు పలు రకాలుగా అనుకోవడం అత్త విన్నది. ‘‘అమ్మారుూ! అందరూ అలా అనుకుంటున్నారేమిటి?’’’ అని ఆమెను అడిగింది. అందుకామె ‘‘ఎవ్వరేమనుకొన్నా, నేను స్వచ్ఛంగానే ఉన్నాను. అందుకు నా అంతరాత్మయే నాకు సాక్షి’’ అన్నది.
ఈ స్వచ్ఛత గురించి అందరూ నేర్చుకోవలసిందే. లోకులు పలుకాకులు వారు ఎమైనా అంటారు. లోకులకు నోరే ఉంటుంది కాని కళ్లు ఉండవు. చూడకుండానే ఏదో ఒకటి అనేస్తారు. కనుక ఎవరికి వారు మనం నిజాయతీగా స్వచ్ఛంగా ఉన్నామా లేదా అని బేరీజు వేసుకొంటూ కాలం గడపాలి. అంతరాత్మకు జవాబు చెప్పగలిగే స్థాయలో ఉంటే ఏ పని చేసినా తప్పు ఉండబోదు. కేవలం మగని దగ్గరే కాదు ఆఫీసుల్లో పనిచేసినా, ఇంట్లోనే పనిచేస్తున్నా నిజాయతీ తో ఉంటే నైతిక విలువలతో జీవిస్తున్నట్టే. - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949