ఆంధ్ర గాథాలహరి

హృదయేశ్వరుడే రేరాజు -93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె కరములెపుడు మోదకరములై వర్తిల్లు
కళల వెన్నొ మిగుల కలుగువాడు
అందనట్టివాడు, అందమ్ముగలవాడు
రాజు వాడు, హృదికి రాజువాడు
-ఇది ఒక అందమైన గాథ. రేరాజైన చంద్రుణ్ణీ తన మనసుకు రాజైన ప్రియుణ్ణీ ఏకకాలంలో వర్ణిస్తోంది నాయిక. వర్ణించే పదాలు ఇద్దరికీ వర్తించే విధంగా ఉన్నాయి. కరములు అంటే కిరణములు అని ఒక అర్థం. చేతులు అని మరో అర్థం. ప్రియుని పరంగా వాని కరస్పర్శ ఆనందకరమనీ, చంద్రుని పరంగా చంద్రుని కిరణ స్పర్శ ఆహ్లాదకరమనీ అర్థం. చంద్రునిపరంగా కళలు కల్గిన వాడనీ, ప్రియుడు కళలో నిష్ణాతుడనీ, అర్థం. చాలా దూరంలో ఉన్నాడు కనుక చంద్రుణ్ణెవరూ అందుకోలేరనీ, తన ప్రియుణ్ణి కూడా ఉన్నతుడు కనుక ఎవరూ అందుకోలేరనీ అర్థం. అంటే చంద్రుడికీ, తన ప్రియుడికీ అభేదాన్ని కల్పిస్తుంది నాయిక ఈ గాథలో ఏ పడతి యైనా తన ప్రియుణ్ణి అందిరకన్నా ఉన్నతంగానే భావిస్తుంది. అందులో కాస్త కవిత్వపుచ్ఛాయలు ఉన్న నాయకలైతే మరీను. సృజనాత్మకతపాలు కాస్త ఎక్కువైతే ఏకంగా చంద్రునికన్నా మిన్న మావారు అన్నా అంటారు. అది కవిత్వంలోని చతురత. పైగా అవి కవి సమయాలు. కాదనలేము సుమా !

ప్రాకృతమూలం

దీసంతోణ అణసుహో ణివ్వు ఇజణఓ కరేహిం విఛివంతో అబ్భత్థిఓణ లబ్భఇ చందో వ్వపిఓ కలానిలఓ (రాజరసికుడు)
సంస్కృత చ్ఛాయ
దృశ్యమానో నయనసుఖో నిర్వృతి జననః కరాభ్యామపి స్పృశన్ అభ్యర్థితో నలభ్యతే చంద్ర ఇవప్రియః కలానిలయః
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949