ఆంధ్ర గాథాలహరి

అప్పుడప్పుడూ తప్పదు-94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె రత్న ఖచితమైన, రమ్యహారమునైన
పడతి ప్రక్కనుంచు, పడకగదిని
ఎంతఘనునికైన హీనత తప్పదు
సమయ మహిమవలన, స్థలమువలన

-ఎంత సుగుణవంతులైనా కాలమహిమవల్ల అప్పుడప్పుడూ పలుచనవుతూ ఉంటారు. అది ఎలాగంటే ఎంత రత్నాలు, వజ్రాలు పొదిగిన హారాన్నయినా ప్రేయసి ఏకాంతంలో తీసి ప్రక్కన పెడుతుంది కదా!
వివరణ: సమయం సందర్భం లేకుండా మాట్లాడేవారి విషయంలోనూ, సమయంకాని సమయంలో ‘తగుదునమ్మా!’ అ ని తయారయ్యేవారి విషయంలోనూ ఈ గాథ అన్వయం. వర్షాకాలంలో కురిసే వానకే గౌరవం. కారణం అది అప్పుడు అవసరం కాబట్టి. అదే వర్షం పంట కోతలప్పుడు వస్తే స్వాగ తం పలికేవారుండరు సరికదా! ఇప్పుడెందుకొచ్చిందో ఈ వాన అని విసుక్కుంటారు. అట్లానే ఎంత మంచి మిత్రునితోనైనా సమయా సమయ వివేచనతో ప్రవర్తించమని ఈ గాథ నీతి చెబుతుంది.

ప్రాకృతమూలం

ఖిప్పఇ హారో థణమండలాహి తరుణీ అ రమణ పరిరంభే అంచి అగుణా విగుణినో లహంతి లహు అతణం కాలే (మకరందుడు)
సంస్కృతచ్ఛాయ
క్షిప్యతే హారః స్తన మండలాత్తరుణీభీ రమణ పరిరంభే
అర్చిత గుణా అపిగుణినో లభంతే లఘుత్వం కాలేన
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949