ఆంధ్ర గాథాలహరి

మన్మధాగ్ని-95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ అగ్ని వేరు కనగ మన్మధాగ్ని వేరు
సరస హృదులందు ప్రేమాగ్ని సతముమండు
రసవిహీన జనుని అంతరంగమందు
మన్మధాగ్ని క్షణములోనే మాయవౌను

-ఒక నాయిక తన చెలితో చెపుతోంది. తన ప్రియుడు అరసికుడనీ, అతనికి హృదయంలో తనపై ప్రేమాగ్ని క్షణంలో ఆరిపోతోందనీ, అతడే కనక సరసుడైతే మన్మధాగ్ని అతని మనస్సులో నిరంతరం ప్రజ్వలిస్తుండేదని బాధపడుతూ చెపుతోంది.
వివరణ:్భర్యాభర్తలమధ్య ప్రేమలు చిరకాలం కొనసాగాలంటే సున్నితమైన భావననలు, పరస్పరానురాగం అనేవి అతి ముఖ్యమైన అంశాలు. ప్రేమ లేని సంసారం నిస్సారంగా ఉప్పులేని పప్పులా చప్పగా సాగుతుంది.

ప్రాకృతమూలం

అణ్ణో కోపి సుహోవో మమ్మహసి హిం హలా హ ఆసస్స
విజ్ఘా ఇ నీరసాణాం హి అఏ సరసాణం ఝత్తి పజ్జలఇ (రామదేవుడు)
సంస్కృతచ్ఛాయ
అన్యః కోపి స్వభావో మన్మథ శిఖినో హలా హతాశస్య
నిర్వాతి నీరసానాం హృదయే సరసానాం ఝటితి ప్రజ్వలతి
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949