ఆంధ్ర గాథాలహరి

సదాశివుడు - శాలివాహనుడు-98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె కామితముల దీర్ప, కష్టంబులను బాప
కలిమి బలిమి జవముగలుగువారు
శాలివాహనుండు, సర్వేశ్వరుండును
గాక, అన్యులెవరు కలరు ధరణి
-ఇది నాటి సమాజంలో శాలివాహనుడిపై వున్న ప్రజాభిప్రాయం. ‘ఆ రాజు దేవుడిలాంటివాడు’- అంటారే అదే అభిప్రాయం క్రీ.శ. 11వ శతాబ్దంలో శాలివాహనుడిపై ఉందన్నమాట. ఇతడు పరమశివుడిలా ఏదడిగినా ఇస్తాడనీ, కష్టాలనుంచి గట్టెక్కిస్తాడనే ప్రజాభిప్రాయానికి ప్రబల సాక్ష్యం ఈ గాథ.
ఈ గాథను చదువుతూంటే మొఘల్ పాదుషా షాజహాన్ ఆస్థానంలో విలసిల్లిన క్రీ.శ.17వ శతాబ్దానికి చెందిన జగన్నాధ పండిత రాయలవారి క్రింది శ్లోకం గుర్తుకురావడంలేదూ!
ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా
మనోరధం పూరయితుం సమర్థః
అనేన కేనాపి నృపేనదత్తం
శాకాయ వాస్యాత్ లవణాయ వాస్యాత్
-కోరికలు తీర్చాలంటే ఢిల్లీ పాదుషా అయినా అయి ఉండాలి లేదా సాక్షాత్తు పరమేశ్వరుడైనా కావాలి. వేరొక రాజు ఇచ్చేది ఏదయినా ఏ కూరకో, ఉప్పుకో సరిపోయేదే అవుతుంది.
ప్రాకృతమూలం
ఆవణ్ణాఇం కులా ఇందోవ్విఅ జాణన్తి ఉణ్ణ ఇంణేఉం
గోరి అహి అఅదఇఓ అహవా సాలాహణ ణరిన్దో (పృథ్వీనాథుడు)
సంస్కృతచ్ఛాయ
ఆపన్నాని కులాని ద్వావేవ జానీత ఉన్నతిం నేతుమ్ గౌర్యా హృదయ దయితో థవా శాలివాహన నరేన్ద్రః

- ఇంకావుంది

-డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949