ఆంధ్ర గాథాలహరి

ఎంతవారలైనా కాంతదాసులే!-99

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె నీరజాక్షి! కనగ, నీదు కనుబొమల
విల్లునుండి బయలు వెడలుచున్న
వాలుచూపులనెడు, బాణాలు తగిలియు
బ్రతికి బయటపడిన వాడెవండు?
‘‘అందమైన కన్నులుగల ఓ అమ్మారుూ! నీ కనుబొమలు అనే విల్లునుండి వెలువడుతున్న వాలు చూపుల బాణాలు తగిలి బ్రతికి బట్టకట్టిన వాడెవడు?’’ అని అందమైన నాయిక వాడి చూపులను వర్ణిస్తున్నాడు గాథాకారుడు. ‘చంపేసేంత అందం’ అంటారే! అదే ఈ గాథలోని విశేషం.
వివరణ
‘ఆడదాని ఓర చూపులో, ఈ జగాన ఓడిపోని ధీరుడెవ్వడో!’ అంటాడో సినీ కవి. ‘ఇంతులు తారసిల్లువరకే’నంటాడు చింతామణి నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావుగారు. ‘ఎంతవారలైనా కాంత దాసులే’ అంటాడు త్యాగరాజస్వామివారు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కామం ధర్మబద్ధమైతే ఆమోదయోగ్యమూ, ఆనందకరమూ అవుతుంది. లేదంటే రావణ, కీచకులకు పట్టిన గతే పడుతుంది.
ప్రాకృతమూలం
మారేసి కం ణ ముద్ధే ఇమేణ పేరంత రత్త విసమేణ
భుల ఆచావ విణిగ్గ అతిక్ఖ అరద్ధచ్ఛి భల్లేణ (శ్రీమాధవుడు)
సంస్కృతచ్ఛాయ
మారయసి కంన మగ్ధే అనేన పర్యంతరక్త విషమేణ భ్రూలతాచాప వినిర్గత తీక్షణతరా ర్థాక్షిభల్లేన
- ఇంకావుంది

-డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949