ఆంధ్ర గాథాలహరి

భాగ్యశాలి-100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె ఆలుబిడ్డలెపుడు అనుకూలముగనున్న
వాడె, చూడ! పరమ భాగ్యశాలి
అట్లు లేనివాడు అవనీధవుండైన
కడు దరిద్రుడనుట, కటిక నిజము
అనుకూలంగా వున్న భార్యా బిడ్డలున్నవాడే లోకంలో అదృష్టవంతుడు, ధనవంతుడు. అలా కాకుండా నిరంతరం జగడమాడే భార్య, సమస్యలతో సతమతమయ్యే సంసారమున్నవాడు ఎంత ఐశ్వర్యమున్నా, తుదకు రాజాధిరాజే అయినా వాడు కటిక పేదవాడితో సమానం అని ఈ గాథాకారుడి భావం!
వివరణ
వేమన ‘ఇంటిలోని పోరు ఇంతింత కాదయా’ అంటాడు. అంటే ఇంటిలో పోరు ఇంత అని చెప్పడానికి వీల్లేది అర్థం. ఎవరికైనా బయట ఒత్తిళ్లనుంచి ఉపశమనం ఇంటివద్దే లభించాలి. కానీ ఇంటిలోనే ఒత్తిడి ఉంటే ఆ మనిషికి మనశ్శాంతి కరవే. కాలం వెంట పరుగులు పెడుతున్న నేటి తరుణంలో భార్యాభర్తలు ఎక్కువ, తక్కువల చర్చ జోలికి పోకుండా సమన్వయంతో ఇంటిని ‘ఆనందనిలయం’ చేసుకోవాలి. సమాజాన్ని ఆనందబంధురంగావించాలి.
ప్రాకృతమూలం
సాహిణపి అఅమో దుగ్గ ఓ విమణ్ణఇ కఅ త్థమప్పాణమ్
పి అరహిఓ ఉణ పుహవిం విపాలి ఉణ దుగ్గ ఓ చ్చే అ (ఈశ్వరుడు)
సంస్కృతచ్ఛాయ
స్వాధీనప్రియతమో దుర్గతోపి మన్యతో కృతార్థ మాత్మానమ్ ప్రియరహితః పునః పృథివీ మపి ప్రాప్య దుర్గత ఏవ
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949