ఆంధ్ర గాథాలహరి

పరిహాసమా? పరితాపమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృత మూలం
చిత్తాణి అదఇ అసమాగమమ్మి కఅమణ్ణు ఆఇం భరిఉరెవె
సుణ్ణం కలహా అంతీ సహీహిరుణ్ణాణ ఓహసి అ!! (మండాధిపుడు)
సంస్కృత ఛాయ
చిత్తానీ తదయిత సమాగమే కృతమంన్యు కాని స్మృత్వా!
శూన్యం కలహాయమానా సఖీ భీరుదితానోపహసితా!!
తెలుగు
మగడు పరకాంత చింతనామగ్నుడవగ
బయటపడలేక కుసుమాంగి వచుచుండి
శూన్యమున కలహింపగా జూచి, చెలులు
పరిహసించుటకు బదులు, బాధపడిరి
పరకాంతా వ్యామోహంలో పడిన భర్తను తలచుకొని బాధపడుతూ గాలిలో పోట్లాడుతున్న సఖిని చూచి చెలులు పరిహసించడానికి బదులు బాధపడ్డారట. అంటే ఆమె దుఃఖం వారినీ కదిలించిందన్నమాట. కాంతలందరూ తమ మగనిపైనే అన్నీ ప్రాణాలు పెట్టుకుని జీవిస్తుంటారు.వారి ఆశలు, ఆశయాలు అన్నీ అతని చుట్టే అల్లుకుని ఉంటాయ.వారి లోకంలో కేవలం తమ భర్త , పిల్లలు మాత్రమే ఉంటారు. ఆ సంసారం సాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు మగని ప్రేమ దొరికితే చాలు అష్టకష్టాలను, అపర దారిద్య్రాన్ని కూడా సంతోషంగా అనుభవిస్తుం టారు. ఇంతటి ప్రేమోన్నతులైన వారిని వదిలి పరకాంతా వ్యామోహి తులయ్యారన్న విషయం ఆ కాంతామణులకు తెలిస్తే వారి బాధ వర్ణనా తీతం. కనుక మొదట విషయం తెలిసి ఈ కాంతామణిని ఎగతాళి చేద్దామనుకొన్న తోటి పడచుల ఆమె బాధ పడడం చూసి వారు కూడా చింతాకాంతులయ్యారు. నిజమే కదా. ఆనాడే కాదు నేడు కూడా రహదారులను విడిచి పక్కదార్లు పట్టే మగవారికి దీన్ని చూచైనా మనసు కరుగుతుందేమో చూడాలి. - ఇంకావుంది...