ఆంధ్ర గాథాలహరి

చెంత లేకుంటే చింతే-103

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె మధుర సౌరభములు, మంగళవాద్యమల్
భక్ష్య భోజ్యతతులు, పానకములు
కంటగింపులాయె, కాంతకు హోళిలో
చెంత ప్రియుడు లేని చింత చేత
హోళీ పండుగ జరుగుతోంది. మంగళవాద్యాలు అందంగా మ్రోగుతున్నాయి. సుగంధ పరిమళాలెల్లెడలా వెదజల్లబడుతున్నాయి. తినడానికి రుచికరమైన పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ ఆమెకు ఆనందం కలిగించడంలేదు. కారణమేమిటంటే ప్రియుడు చెంత లేకపోవడమే.
వివరణ
ఇష్టమైన మగడు తోడుంటే అడవి కూడా నందనోద్యానవనమే. ఆ తోడు లేకుంటే ఆకాశహర్మ్యమైనా అడవితో సమానం. పండుగ మనసుకు రావాలి. క్రొత్తబట్టలు, పిండి వంటలు ఇవేవీ పండుగను రప్పించలేవు. ఆత్మీయతలు, అనుబంధాలు మెండుగా ఉన్న ఇంట్లోనే పండుగ. అవన్నీ ఉన్న రోజే నిజమైన పండుగ. అదే విషయాన్ని ఈ గాథా ప్రతిపాదిస్తుంది.
ప్రాకృతమూలం
ఉప్పహపహా విహజణోపవి జిమ్హి అకల అలో పహ ఆతూరోఅవ్వోసో చ్చే అక్ఖణో తేణవిణా గామడాహో వ్వ
సంస్కృతచ్ఛాయ
ఉత్పధ ప్రధావిత జనః అపవిజృంభిత కలకలః ప్రహత తూర్యః దుఃఖం స ఏవ క్షణస్తేన వినాగ్రామ దాహ ఇవ!
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949