ఆంధ్ర గాథాలహరి

వాననీళ్లు కన్నీళ్లు -104

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె ఆమె ఇంటిలోని అవనీతలంబెల్ల
తడియుచుండె వర్షధార తోడ
కొంత మిగిలెనేని గుడిసెయందు, అదియు
తడియు, నామె బాష్పధారతోడ
పాపం అది ఒక పేదరాలి గుడిసె. గుడిసె కప్పుకు అన్నీ రంధ్రాలే. పతి ఇంట లేడు. వర్షం వచ్చింది. ఇంటి కప్పు రంధ్రాల్లోంచి వర్షం ధారగా ఇంటిలోని నేలను తడిపేస్తోంది. భర్త దగ్గర లేకపోవటంవల్ల ఆమె కళ్ళూ వర్షిస్తున్నాయి. వర్షం తడపకుండా మిగిలిన నేలేమైనా ఉంటే, దాన్ని కూడా ఆమె అశ్రుధార తడిపేస్తోందట.
వివరణ ; కష్టాల్లో పతి దగ్గర లేకపోవటం ఏ సతికైనా దుస్సహమే! దుర్భరమే! అందునా జోరున వాన కురుస్తున్నపుడు, చిల్లుల ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏ సతికైనా కన్నీళ్ళే వస్తాయి. దాన్ని కరుణ రసాత్మకంగా చిత్రించాడు గాథాకారుడు. ఆమె ఇల్లు మొత్తం తడిసిపోయిందని ధ్వని పూర్వకంగా చెప్పడం ఈ గాథలోని విశేషం. దుఃఖంలో కన్నీళ్లు వర్షధారలను మించిపోతా యనేది కూడా ఎవరికైనా అనుభవైక వేద్యమే కదా. ఎవరూ దుఃఖానికి దూరంగా ఉండలేరు. ప్రతివారికి చిన్నదో పెద్దదో ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది.
ప్రాకృతమూలం
పహి అవహు వివరం తరగలి అజలోల్లే ఘరే అణోల్లంపి
ఉద్దేసం అవిర అవాహ సలిలణి వహేణ ఉల్లేఇ (స్పందనుడు)
సంస్కృతచ్ఛాయ
పథిక వధూర్వి వరాం తరగలిత జలార్ద్రే గృహే నార్ద్రమపి
ఉద్దేశము విరత బాష్ప సలిల నివహే నార్ద్రయతి
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949