ఆంధ్ర గాథాలహరి

స్థిరచిత్తుని తత్వం-105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె చెరకు గడకు గాని, స్థిరచిత్తునకుగాని
నలిగిపోవు బాధ కలుగుగాక!
ఒకటి మధుర రసము నొసగు, మరియొకండు
మధుర భాషణంబు మానలేడు

భావం : చెరకు గడను పీల్చి పిప్పి చేసినా కూడా మధురమైన రసానే్న ఇస్తుంది. అలాగే ఉత్తములైన వాళ్ళకు బాధ కలిగినా కూడా కఠినంగా, అప్రియంగా మాట్లాడకుండా తమ సహజమైన రీతిలో మధురంగానే మాట్లాడతారు.

వివరణ:

ఉత్తములైనవాళ్ళకు బాధ కలిగితే వౌనంగా భరిస్తారు కానీ నిందించడంగానీ, దూషించడంగానీ చేయరు అని ఈ గాథ ప్రతిపాదిస్తుంది. అంటే ఉత్తములకు ఎప్పుడూ బాధ కలిగింకూడదన్నమాట. వాళ్లు గోవుల్లాంటివాళ్ళు. వౌనంగా బాధపడే గోవులనూ, ఉత్తములనూ హింసించడంవల్ల లోకానికి మేలు జరుగదు సరికదా కీడు ముంచుకువస్తుంది.

ప్రాకృతమూలం

జీవోఇ కుణంతి పిఅం భవంతి హి అఅమ్మిణివ్వు ఇంకాఉం
పీడిజ్జెంతా విరసం జణంతి ఉచ్ఛూ కులీణా అ
సంస్కృతచ్ఛాయ
జిహ్యాయాం కుర్వంతి ప్రియం భవంతి హృదయే నిర్విృతింకర్తుం పీడ్యమానా అపిరసం జనయింతీక్షవః కులీనాశ్చ
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949