ఆంధ్ర గాథాలహరి

పెళ్లివేళ-108

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె ముగ్ధ మోహనముగ ముతె్తైదువులు పాడు
పెండ్లి పాట కోరి వినగననగ
వరుని పేరు విన్న వధువుకు మేనెల్ల
పులకరించె, సిగ్గు పలుకరించె

ఒక అమ్మాయికి పెండ్లి కుదిరింది. పెండ్లికూతుర్ని చేస్తున్నారు. ముతె్తైదువులు పెండ్లి పాటలు పాడుతున్నారు. ఆ పాటల్లో వరుని గోత్ర నామాలు వినిపించాయి. అవి విన్న వధువుకు మేనెల్లా పులకలు పొటమరించాయి. పులకలు కూడా పెండ్లి పాటలు వినడానికి వచ్చాయా అన్నట్లున్నాయని చమత్కరిస్తున్నాడు గాథాకారుడు. ఇప్పుడే ఇంత పులకరింతలు, పలవరింతలుగా ఉన్న ఈ వధూవరుల దాంపత్యం మున్ముందు మరెంత మధురంగా సాగుతుందోనని చర్చించుకుంటున్నారట పెండ్లికి వచ్చిన అమ్మలక్కలు.
నిజమే కదా. జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్లి అనే వేడుక నూరేళ్ల జీవితాన్ని పండువెనె్నల వలె చేస్తుంది. ఆ నూరేళ్లజీవితంలో జీవిత భాగస్వా మి ఎలా ఉంటాడన్న దానిమీద ఆడపిల్ల తన ఆశలను పెంచుకుంటుంది.
మంచి వరుడు లభించితే ఆ వనిత జీవితం మూడు పువ్వులూ ఆరుకాయలే. అందుకే ఆ వధువు పెళ్లిమండపంలో వరుని గురించి తెలుసుకొని తన జీవితమకరందాన్ని మరింత తీయ తేనియలను వేయ విధాలుగా ఒలికింపచేసే మధుపం ఇతడే కదా అని మురిసిపోతుంది. తన భావిజీవితాన్ని సుందరంగా వూహించుకుంటూ తాను మురుస్తూ ఇతరులకు ఆనందాన్ని పంచుతుంది.
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949