ఆంధ్ర గాథాలహరి

నేనే ఇష్టం కాకుంటే..-110

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె ఏమి సేయనీకు ఇష్టంబు కాదేని
అట్లు సేయకుండు టగునుగాని
హృదిని అసలు నేనె ఇష్టంబుకాకున్న
ఏమి సేయగలను? ఏది దారి?

ఏమేం చేస్తే నీకు ఇష్టం కాకుండా ఉంటుందో వాటిని చేయకుండా ఉండి నీకు అనుకూలంగా వర్తించగలను గానీ, అసలు నేనే నీకు ఇష్టం లేకపోతే నేనేం చేయగలను? అంటోంది పరాన్ముఖుడైన నాయకునితో నాయిక.

వివరణ

స్ర్తి పురుషుల మధ్య ప్రేమ ఉదయించడానికి పెద్దగా కారణాలేం ఉండక్కర్లేదు. అది అత్యంత సహజంగా చెట్టుకు పూవు పూసినంత సుకుమారంగా జనిస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా ఏకపక్ష ప్రేమను కొనసాగిస్తే దుష్పరిణామాలే సంభవిస్తాయి. అవసరార్థ ప్రేమలు, వ్యాపారాత్మక ప్రేమల గురించి ఆలోచించకపోవడమే మంచిది.

ప్రాకృతమూలం

జంజం తేణ సుహా అణ తంతంణ కరేమి జంమమా అత్తం
అహఅం చిఅజం సుహామి సుహఅ తం కింమమా అత్తం (మేఘచంద్రుడు)
సంస్కృతచ్ఛాయ
యద్యత్తేన సుఖాయతే తత్తన్నకరోమియన్మమాయత్తమ్
అహమేవయన్న సుఖాయే సుభగ తత్కిం మమాయత్తమ్
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949