శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మా గూడు ఏమవుతుందో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వేతో కాలువగట్ల వాసుల ఆందోళన
వేదాయపాళెం, నవంబర్ 29: నగరంలోని కాలువగట్లపై ఆక్రమణలను గుర్తించేందుకు గత మూడు రోజులుగా కార్పొరేషన్ అధికారులు బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహిస్తున్నారు. నగరంలో ఉన్న 14 పంట కాలువలు ఆక్రమణలకు గురై కుంచించుకు పోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో అనేక ప్రాంతాలు జలమయమై వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నగరంలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి నగర పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. కాలువలన్నీ ఆక్రమణలకు గురికావడం వల్లే పలు ప్రాంతాలు నీట మునిగాయని పేర్కొన్నారు. తక్షణం ఆక్రమణలకు గురైన కాలువలను గుర్తించి వాటిని తొలగించేందుకు సర్వే జరిపి నివేదికను సిద్ధం చేయాలని దేశించారు. దీనితో కార్పొరేషన్ అధికారులు, జిల్లాయంత్రాంగం యుద్ధప్రాతిపదికన కాలువలపై ఆక్రమణలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. గత కొద్ది రోజులుగా నగరంలోని పలు పంట కాలువలపై ఎవరెవరు అక్రమ కట్టడాలు చేపట్టారో గుర్తించే పనిని అధికారులు చేపట్టారు. దీంతో కాలువగట్లపై అనేక సంవత్సరాలుగా నివాసం ఉండే పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము ఎప్పటి నుండో ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని, తమకు అధికారులు ఇళ్లపట్టాలు కూడా మంజూరు చేశారని ఇప్పుడున్నఫళంగా తొలగిస్తామంటే ఎలా అని వారు వాపోతున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఎక్కడ తొలగిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కూడా అధికారులు ధనికులకు ఒకలా, పేదలకు మరోలా మార్కింగ్ చేస్తున్నారని అధికారులతో వాగ్వివాదాలకు దిగుతున్నారు. కాలువగట్లపై సుమారు 40 వేల మంది ఉంటారని అధికారుల అంచనా. వీరిలో ఎక్కువ శాతం నిరుపేదలు, మధ్యతరగతి కుంటుంబాలు కావడం వారందరికీ ప్రత్యామ్నాయం చూపడం కూడా ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు పేదల ఇళ్లను తొలగించే ముందు వారికి ప్రత్యామ్నాయంగా పక్కా ఇల్లు నిర్మించి అన్ని వసతులు కల్పించాకే ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలలో చర్చనీయాంశమైంది.