రాష్ట్రీయం

‘తెల్ల’బోయిన అంగన్‌వాడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటు జీతాల పెంపు.. అటు రేషన్ కార్డులు కట్ * రంగం సిద్ధం చేసిన సర్కార్

విజయవాడ, మార్చి 17: మోకాలకీ బోడిగుండుకూ ముడిపెట్టినట్లుగా ఉద్యమాల కారణంగా అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు పెంచిన వేతనాలు వారికి మరో రకంగా నష్టాన్ని తెచ్చి పెడుతున్నాయి. వచ్చే నెల నుంచి కొత్త జీతాలు అందుకోబోతున్న అంగన్‌వాడీలకు వార్షిక ఆదాయ పరిమితి దాటారంటూ తెల్లకార్డుల్ని సామూహికంగా తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇంకా కొత్త జీతాలు చేతికి రాకుండానే అంగన్‌వాడి ఉపాధ్యాయులు ’తెల్ల’బోయే పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం వల్ల 55వేల 607 మంది అంగన్‌వాడీ ఉపాధ్యాయులు తెల్లరేషన్ కార్డులను కోల్పోనున్నారు. ఇప్పటివరకు వర్కర్లకు నెలకు రూ.4200లు, హెల్పర్లకు రూ.2200 చెల్లిస్తూ వచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 48వేల 770 మెయిన్, 6వేల 837 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ప్రతి కేంద్రంలోను ఒక వర్కర్, ఒక హెల్పర్ పనిచేస్తున్నారు. ఇదిలా వుంటే తెల్లకార్డు పొందటానికి గ్రామాల్లో రూ.72వేలు పట్టణాల్లో రూ.75వేలను వార్షికాదాయ పరిమితిగా ఓ విధానాన్ని రూపొందించటం జరిగింది. ఇదిలా వుండగా పూర్తిస్థాయిలో పనిచేయించుకుంటూ అరకొర వేతనం ఇవ్వడంపై సుదీర్ఘ ఆందోళనల అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వర్కర్లకు ముందు రూ.7వేల 200లు పెంచుతామని ఆపై ఏడువేలకు అలాగే హెల్పర్లకు రూ.4వేల 500లకు పెంచడానికి అంగీకరిస్తూ ఈమేర ఏప్రిల్ మాసం నుంచి చెల్లించేందుకు అంగీకరించారు. ఇదిలా వుంటే మీకు తెల్లకార్డులను ఎందుకు తొలగించరాదో మండల తహశీల్దార్ కార్యాలయంలో డెప్యూటీ తహశీల్దార్ (సివిల్ సప్లయి) సంజాయిషీ ఇచ్చుకోవాలని లేనిపక్షంలో తమ వద్దనున్న ఆధారాల ప్రకారం గులాబీ కార్డుకు సిఫార్స్ చేస్తామంటూ తహశీల్దార్ల పేర అంగన్‌వాడీ వర్కర్లకు నోటీస్‌లు జారీ అవుతున్నాయి. ఈమేర గత రెండు రోజులుగా ప.గో జిల్లా పోలవరం మండలం బంగారంపేట, కొత్త పట్టిసీమ, గూటాల రామయ్యపేట గ్రామాల్లోని అంగన్‌వాడీలకు నోటీస్‌లు జారీ అవుతుండగా రాష్టవ్య్రాప్తంగా ప్రకంపనాలు చోటుచేసుకుంటున్నాయి. పెరిగిన వేతనం ప్రకారం వర్కర్లకు సాలీనా రూ.84వేలు ఆదాయం దాటుతున్న కారణంగానే నోటీసులు జారీ చేయబోతున్నామని కృష్ణా, గుంటూరు జిల్లాల సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. అలా కాదు ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమేనని గతంలో ఉద్యమాల్లో పాల్గొన్నవారిని కూడా తొలగించేందుకు కుట్ర జరిగిందని సిఐటియు అనుబంధ ఆం.ప్ర. అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, అధ్యక్షురాలు జి.బేబిరాణి ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. ఏదో రీతిలో అంగన్‌వాడీలకు తెల్ల రేషన్‌కార్డును రద్దుచేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. కార్మికశాఖ నిబంధనల ప్రకారం అయినా లేక వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినా కనీస వేతనం, పిఎఫ్, ఇఎస్‌ఐ, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి సౌకర్యాలు లేవన్నారు. అంగన్‌వాడీలకు తెల్లరేషన్‌కార్డులను రద్దు చేయాలనే ప్రభుత్వ ఆలోచనను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
ఇదిలా వుంటే రాష్ట్రంలో కార్డుల ఏరివేత ఇక తీవ్రతరం కాబోతున్నది. ఇందుకుగాను ఏడంచెల విధానాన్ని తెరపైకి తెచ్చారు. నాలుగు చక్రాల మోటార్ వాహనం, ఐదెకరాల మెట్ట లేదా రెండెకరాల మాగాణి భూమి, నెలకు 200 యూనిట్లు విద్యుత్ వినియోగం దాటినా, ప్రభుత్వ ఉద్యోగి అయినా తక్షణం తెల్ల కార్డును తొలగించబోతున్నారు. గత జన్మభూమిలోను ఈ విధంగా రాష్టవ్య్రాప్తంగా 40వేల తెల్లకార్డులను తొలగించినట్లు తెలుస్తోంది. ఆర్‌టిసి కాంట్రాక్ట్ ఉద్యోగుల తెల్ల కార్డులను కూడా తొలగించబోతున్నారని తెలిసింది.