జాతీయ వార్తలు

అనిల్ అంబానీకి ఎలా తెలిసింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాఫెల్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ సారి ఆయన ఈ-మెయల్‌ను ఆధారంగా చూపించారు. రాహుల్ మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్ డీల్‌కు ముందు అనిల్ మినిస్టర్స్ ఆఫీసుకు వెళ్లార‌ని, ఒప్పంద ప‌త్రం త‌యారీలో ఉన్నద‌ని, ప్రధాని విజిట్ చేసే స‌మ‌యంలో దానిపై సంత‌కాలు జ‌రుగుతాయ‌ని కూడా ఆ మెయిల్‌లో ఉంది. ప్రధాని మోదీ విజిట్ క‌న్నా ముందే.. అనిల్ అంబానీ ఎలా ఫ్రాన్స్ ర‌క్షణ‌మంత్రితో భేటీ అవుతార‌ని రాహుల్ ప్రశ్నించారు. ఎంవోయూ గురించి అనిల్ అంబానీకి తెలియడం అంటే... కచ్చితంగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని రాహుల్ గాంధీ ఇవాళ పేర్కొన్నారు. ‘‘ఇకపై ఇది కేవలం అవినీతి కేసు మాత్రమే కాదు... ఇది రాజద్రోహం కేసు కూడా.... ప్రధానమంత్రి మోదీ ఓ గూఢచారి మాదిరిగా వ్యవహరించారు. ఈ ఒప్పందం సంగతి రక్షణ మంత్రి, హెచ్ఎఎల్, విదేశాంగ కార్యదర్శికి సైతం తెలియకుండా కేవలం అనిల్ అంబానీకి 10 రోజుల ముందే ఎలా తెలిసింది? ’’ అని రాహుల్ ప్రశ్నించారు.