జాతీయ వార్తలు

అనిల్ అంబానీకి సుప్రీంలో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎరిక్సన్ ఇండియా కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎరిక్సన్‌కు నాలుగు వారాల్లోపు రూ.453 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలల జైలుశిక్ష తప్పదని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎఫ్ నారీమన్, జస్టిస్ వినీత్ సహరన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. రిలయన్స్ టెలికామ్ చైర్మన్ సతీష్ సేత్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్‌పర్సన్ ఛాయా విరానీలు తలా రూ. కోటి రూపాయలు అపరాధ రుసుం చెల్లించాలని, నెలలోపు ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే నెలరోజుల పాటు జైలుశిక్ష అనుభవించాలని కోర్డు పేర్కొంది.