బిజినెస్

అనిల్ అంబానీ, స్పీల్‌బర్గ్ సారథ్యంలో సినీ, టెలివిజన్ సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబ్లిన్ పార్ట్‌నర్స్ పేరిట జాయింట్ వెంచర్
500 మిలియన్ డాలర్లతో ఏర్పాటు
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టివెన్ స్పీల్‌బర్గ్‌కు చెందిన డ్రీమ్‌వర్క్స్.. గురువారం అంబ్లిన్ పార్ట్‌నర్స్ అనే ఓ కొత్త సినిమా, టెలివిజన్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ జాయింట్ వెంచర్‌లో జెఫ్ స్కోల్ నేతృత్వంలోని పార్టిసిపెంట్ మీడియా, అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ అయిన ఎంటర్‌టైన్‌మెంట్ వన్ (ఈ వన్) కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఈ జాయింట్ వెంచర్‌ను 500 మిలియన్ డాలర్ల రుణంతో ఏర్పాటు చేస్తుండగా, ఈ నిధులను జెపి మోర్గాన్ చేస్ అందిస్తోంది. కొమెరికా బ్యాంక్, సన్ ట్రస్ట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సిటి నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇందుకు సహకరిస్తున్నాయి. కాగా, 1994 నుంచి డ్రీమ్‌వర్క్స్ స్టూడియోస్‌కు జెపి మోర్గాన్ చేస్ ఆర్థిక సాయం అందిస్తోంది. ఇకపోతే ఈ సందర్భంగా స్పీల్‌బర్గ్ మాట్లాడుతూ ‘మా ఆప్తమిత్రుడైన అనిల్ అంబానీతో కొనసాగుతున్న ఈ సుధీర్ఘ అనుబంధాన్ని మేము ఎంతగానో గౌరవిస్తున్నాం. అద్భుతమైన సినిమాలను నిర్మించడానికి ఇది ఓ సదవకాశంగా మేము భావిస్తున్నాం. అంబానీ సహకారానికి మా కృతజ్ఞతలు.’ అన్నారు. అనిల్ అంబానీ మాట్లాడుతూ ‘స్పీల్‌బర్గ్‌తో మా బంధం ఇప్పటికి ఏడేళ్లు. అంబ్లిన్ పార్ట్‌నర్స్ జాయింట్ వెంచర్‌తో ఇకముందూ ఇది మరింత బలపడగలదని భావిస్తున్నాం.’ అన్నారు.