మెయన్ ఫీచర్

ఆధిపత్య పోరుతో అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యధరా సముద్ర ప్రాంతంలోని అనేక రాజ్యాలల్లో టర్కీ ఒకటి. దీని రాజధాని పేరు అంకారా. ఇంతకుముందు ఇస్తాంబుల్ ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. క్రీ.శ.14వ శతాబ్దానికి ముందు ఇక్కడ భారతీయ సంస్కృతి ఉండేది. ఇస్తాంబుల్ ప్రాచీన నామం వైజయంతిమాల. వారి సంస్కృతి పేరు వైజయంత సంస్కృతి. ఇస్లామిక్ దురాక్రమణల తర్వాత టర్కీ తన ప్రాచీన నాగరికతను కోల్పోయింది. తెలుగులో తురక అనే పదం టర్కీ అనే పదంనుండి వచ్చినట్లు మనం ఊహింపవచ్చు. 1453లో క్రైస్తవ ప్రాబల్యంగల టర్కీని సాయుధ తురుష్కులు స్వాధీనం చేసుకున్నారు. దానితో క్రైస్తవులు అక్కడినుండి పారిపోయారు. వైజయంతం కాన్‌స్టాంటినోపులోగా మారినట్లే తర్వాత ఇస్తాంబుల్‌గా ముస్లిములు పేరు మార్చారు. నేడు టర్కీ రాజధాని అంకారా. సిరియా దాదాపు ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో పడిన తర్వాత టర్కీపై వారి దృష్టిపడింది. ఈ కారణంచేత టర్కీ నాటో మిలటరీ ఒడంబడికగల దేశాలల్లో చేరింది. ఇందులో రష్యాకూడా ఉంది. ఐసిస్ రష్యామీద కూడా తన పంజా విసిరింది. దానితో రష్యా ఎదురుదాడికి దిగింది. ఈ పరంపరలో రష్యా యుద్ధవిమానాలు ఉగ్రవాదుల ఏరివేతలో నిమగ్నమైనాయి. ఇదంతా ఇటీవలి చరిత్రయే.
ఐతే కొద్దిరోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. 2015, నవంబరు 30న రష్యాకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చివేసింది. ఈ ఘటన పోరస్ సిరియన్- టర్కిష్ సరిహద్దులో జరిగింది. ఇది మధ్యధరా సముద్ర ప్రాంతం. ఈ సంఘటనను ఎంతమంది గమనించారో తెలియదు. కాని నాకు మాత్రం ఇది ప్రపంచ చరిత్రను భవిష్యత్తులో మార్చే ప్రముఖ ఘట్టంగా కన్పడింది. ఇందుకు గల కారణాలను విశే్లషిద్దాము.
సిరియా అనే మాట సుర అనే సంస్కృత పదం నుండి పుట్టింది. ఆస్టిరియా అనే మాట అసుర అనే మరొక పదం నుండి పుట్టింది. ఐతే సిరియాలో ఇటీవల ఒక ఉగ్రవాద సంస్థ పుట్టింది. దాని పేరు ‘‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా’’- ఈ రాజ్యాధిపతి పేరు రక్కాఖలీఫా- ఈ ఉగ్రవాద సంస్థ అధిపతి పేరు అబూబకర్. ‘దేవుని రాజ్యాన్ని స్థాపించడంకోసం విశ్వశాంతికోసం ఆయుధాలు పట్టండి’ అని ఐసిస్ పిలుపునిచ్చింది. లోగడ ఒసామా బిన్‌లాడెన్ అనే ఉగ్రవాది కూడా ఇలాగే విశ్వశాంతికోసం ఆయుధాలు పట్టండి- అన్నాడు. స్టేట్ ఎంపైర్ బిల్డింగ్ (2002) పతనం తర్వాత ఈ సంస్థ తీవ్రత అమెరికా గుర్తించింది. ఒసామాబిన్ లాడెన్‌ను అమెరికావారు వెంటపడి వేటాడి అతని శవాన్ని సముద్రంలో పడేశారు. టర్కీలో సుఖోయ్ విమానం కూల్చివేతకుముందు మరికొన్ని సంఘటనలు జరిగాయి. అక్టోబరు-3. అక్టోబరు-4, అక్టోబరు 18 (2015)లల్లో కూడా టర్కీ రష్యాపై ప్రతీకారం తీర్చుకుంది. రష్యాకు చెందిన డ్రోన్ విమానం కూల్చివేయబడింది. ఇంతకూ రష్యా విమానాలు టర్కీలోకి ఎందుకు ప్రవేశించాయి? అంటే అక్కడి ఐసిస్ స్థావరాలను నిర్మూలించే నిమిత్తం.
ఇది టర్కీకి ఇష్టంలేదు. ఎందుకని?? అంకారాలో నాటో కూటమి అత్యవసర సమావేశం నవంబర్ 25న జరిపింది. రష్యా తన భూభాగంలోకి ప్రవేశించి ఐసిస్ ఉగ్రవాదులను వధిస్తున్నదని టర్కీ ఆరోపించింది. ఇది నిజమేకదా! రష్యా అధ్యక్షుడు వ్లాడిమర్ పుతిన్ ఈ సంఘటనకు తీవ్రంగా స్పందించారు. బ్లాక్‌సీ, విడిది గృహంవద్ద జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లాతో పుతిన్ మాట్లాడుతూ, ఇలా టర్కీ నాయకులు వెన్నుపోటు పొడవటం తగదు’అని హెచ్చరించాడు. తన విదేశాంగ మంత్రి సెర్గాయ్‌లావ్‌రోహక్, టర్కీలో చేయవలసిన పర్యటనను పుతిన్ రద్దుచేశాడు.
‘‘మేము ఐసిస్ ఉగ్రవాదులను వేటాడుతుంటే టర్కీ ఎందుకు అభ్యంతరం చెపుతున్నది? ఇది ద్విపాత్రాభినయం వంటిది. టర్కీకి చెందిన ఎఫ్-16-జెట్, మా సుఖోయ్-30 విమానాన్ని కూల్చివేసింది. అది సిరియా సరిహద్దులో పడింది అని పుతిన్ సాక్ష్యాధారాలు చూపించారు. అంటే తాము టర్కీకి శత్రువులు కాదు- ఐసిస్‌కు మాత్రమే విరోధులం- అని రష్యా అధినాయకుని వాక్యానికి అర్ధం.ఉత్తర లతాకియా ప్రాంతంలో రష్యన్లు ఉన్నారు. అక్కడ ఐసిస్ తన హత్యా రాజకీయాలు సాగిస్తున్నదని పుతిన్ వెల్లడించాడు.
అంతర్జాతీయ ఇస్లామిక్ మత ఛాందస ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇటీవల అమెరికా- రష్యాలు ఏక వాక్యానికి వచ్చాయి. అలాంటి దశలో టర్కీ-రష్యావారి విమానాన్ని కూల్చివేయటం ఏమిటి?? ఉగ్రవాదంపై పోరుకు అగ్రరాజ్యాలు సమాయత్తమవుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో టర్కీవారు రష్యా విమానాన్ని కూల్చివేయటం ఏ విధంగా చూచినా సమర్ధనీయం కాదు. నిజంగా రష్యాకు టర్కీపైన దాడిచేసే సంకల్పమే ఉన్నట్లయితే వారు ఆ పని నేరుగా చేయగలిగి ఉండేవారు.
అక్టోబరు 2015లో ఐసిస్ వివిధ దేశాలల్లో 400మందిని హతమార్చింది. ఇందులో పారిస్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌వద్ద జరిగిన దాడులు ఈజిప్టు ఫినాయ్ పర్వతంవద్ద కూల్చిన రష్యా ప్రయాణీకుల విమానం కూడా ఉంది. ఇదంతా ఖలీఫాగారి ఖుదా రాజ్యస్థాపన కోసం ప్రపంచ శాంతికోసం తాము చేస్తున్నామని అబూబకర్‌గారి సైన్యం (ఐసిస్) చెపుతున్నది.
జీహాదీ ఉగ్రవాదంవల్ల కాకేషియన్ రిపబ్లిక్‌లు, ఇండియావంటి ఎన్నో దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. పాకిస్తాన్ దాడులకు ఇండియా నష్టపోయినట్లే తాలిబన్ దాడులకు పాకిస్తాన్ కూడా నష్టపోయింది. రష్యా- అమెరికాలు ఒకప్పుడు బద్ధ శత్రువులు. కాని అంతర్జాతీయ ఉగ్రవాద నిర్మూలన పుతిన్-ఒబామాలు చేతులు కలపటం శుభసూచనగా భావించాలి. అమెరికా ఫ్రాన్సు బ్రిటన్ రష్యా ఇండియా ఆస్ట్రేలియా వంటి దేశాలు కలిసి సమీకృతంగా పోరాడితే ఐసిస్‌తోబాటు దాదాపు నలభై చిన్న పెద్ద ఉగ్రవాద సంస్థలను నిర్మూలించవచ్చు.
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ సిరియా అనే అత్యుగ్రవాద సంస్థ సిరియాలో చాలా నగరాలను ధ్వంసంచేయటమో ఆక్రమించుకోవటమో చేసింది. ఇది జవహరీ, ఒసామాల నేతృత్వంలో నడిచిన అల్‌ఖైదాకన్నా తీవ్ర సంస్థ. ఐతే జైషేమహమ్మద్, లష్కరి తోయిబా, ఇత్తెహాదుల్ మజ్లీస్ సిమీ ఐఎస్‌ఐ వంటి నలభై సంస్థలు ప్రపంచంలో సక్రియంగా పనిచేస్తున్నాయి. యూదు జాతి నిర్మూలనకోసం పాలస్తీనావిమోచనా సంస్థ, హమాస్ వంటివి గాజా పట్టీలో నిరంతరం యుద్ధాలు చేస్తున్నాయి. ముఫ్తిమహమ్మద్ సయ్యద్ (కాశ్మీరు ముఖ్యమంత్రి) స్వగ్రామమైన దక్షిణ కాశ్మీర్‌లోని బిజ్‌బహారాలో పాకిస్తాన్ జండాలు ఎగురవేసి ఐఎస్‌ఐఎస్ జెండాలతో లోయలో ఊరేగింపుచేశారు. జమ్మూ కాశ్మీరులోని ఆర్మీ కాంప్‌లపై బాం బులు విసిరారు. కుప్వారా జిల్లా నిరంతర రణరంగం. ఇన్ని విషయాలు తెలిసినా మన తెల్ల టోపీ వీరులు చిల్లుల టోపీలను సమర్ధించటం ఏమిటి??
రష్యా ప్రధాని ద్విమిత్రిమిద్ దేవ- మాట్లాడుతూ (28-11-2015) తమ దేశ పౌరులు టర్కీలోకి విహారయాత్రలకు (టూరిజం) వెళ్లకూడదని ఆంక్షలు విధించాడు. అంతేకాదు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్మాణం- ఎగుమతులు దిగుమతులు ఆగిపోయాయి. రష్యాతో టర్కీకిగల ద్వైపాక్షిక ఒప్పందాలు రద్దయినాయి. టర్కీ ప్రధాని రికెప్‌లూయిప్ ఎర్దోగన్ తాము ఐసిస్ ఉగ్రవాదులనుండి చమురు కొనుగోలు చేయలేదు- మాపై వచ్చిన ఈ ఆరోపణలు నిరాధారం అన్నారు- అంటే ఐసిస్ ఉగ్రవాదులు చాలా చమురుబావులు స్వాధీనం చేసుకొని తద్వారా వచ్చే ఆదాయంలో అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని (చమురుతో సహా) ఎగుమతి చేస్తున్నారని ఈ వాక్యం వెనుక వ్యాఖ్యా నం.
మాస్కో ఇప్పుడు తన ఆయుధాగారం నుండి ఎస్-400 అనే అత్యాధునిక క్షిపణులను రంగంలోకి దింపింది. వీటి లక్ష్యం ఐసిస్ స్థావరాలే- లతాకియాలోని రష్యా విమాన స్థావర రక్షణ (ఎయిర్‌బేస్) దీని ప్రయోజనం అని చెప్పారు. రష్యా విమానాన్ని కూల్చినందుకు టర్కీనుండి పుతిన్ క్షమాపణ కోరారు. అందుకు టర్కీ అధినేత ఎర్డోగన్ తిరస్కరించారు. ఈ ఈ క్లిష్ట సమయంలో భారతదేశం రష్యాకు అండగా నిలువవలసి ఉంది. ఎందుకంటే మధ్యధరా సముద్రతీరంలోని దేశాలు సిరియానుండి ఎదుర్కొంటున్న ముప్పువంటిదే ఇండియా పాకిస్తాన్ అనే ఉగ్రవాద దేశంనుండి ఎదుర్కొంటున్నది. ఆసియా వాయువ్యప్రాంతంలో ఐరోపాకు దక్షిణంగా కీలక ప్రాం తంలో టర్కీ ఉండటం విశేషం. అందుకే ఈ ఆధిపత్యపోరు మొదలయింది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిర్మూలించేటప్పుడు ఆధిపత్యపోరును గురించి అగ్రరాజ్యాలు ఆలోచించటం మూర్ఖత్వం అవుతుంది. ఉదాహరణకు: సిరియాలో బషార్ అల్ అసాద్ నేతృత్వంలో ఒక నియంతృత్వ పాలన ఉంది. దీనిని లోగడ రష్యా చైనాలు బలపరచాయి. ఈ వ్యవస్థను కూలద్రోయాలని చేసిన ప్రయత్నాలు ఈ కారణంచేత విజయవంతం కాలేదు. ఇప్పుడు అమెరికా అటు అల్‌అసాద్‌కు ఇటు ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రధాన సమస్య ఐసిస్- ఆ తర్వాత అసాద్ నియంతృత్వం- అసాద్ కూటమిపై రష్యాచైనాలకు మక్కువ ఎక్కువ. అసాద్ నిర్మూలన కూడా అమెరికా అభిమతం, ఈ చిల్లర వ్యవహారాలు రష్యా అమెరికాలు మానుకొని అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు సిద్ధపడితే పుట్టిన - ఒబామాలు నిజమైన విశ్వశాంతి కాముకులు అవుతారు.
కానీ నాటో కూటమి మనస్ఫూర్తిగా సహా యం చేయడం లేదని ఆరోపణ వచ్చింది. అమెరికా ద్విపాత్రాభినయం చేస్తోందన్న ఆరోపణల్లో నిజం ఉండవచ్చు. కాని టర్కీ త్రిపాత్రాభినయం చేస్తున్నది. ఇటు నాటో కూటమిలో ఉండి అటు రష్యా విమానాన్ని కూల్చివేసి, మరొకవైపు ఐసిస్ నుండి చము రు నిక్షేపాలు కొనుక్కుంటున్నది. హిల్లరి క్లింటన్ 1-12-2015నాడు మాట్లాడుతూ వారు (అమెరికా) పదాతి సైనికులను టర్కీలో ప్రవేశపెట్టబోవటంలేదని విమానదాడులే శ్రేష్టమని ప్రకటించింది. స్కాట్లండ్ యార్డ్ నుండి బ్రిటిష్ సైన్యం పంపిన టైఫూన్ జెట్ విమానాలు, టార్నడోలు చమురు క్షేత్రాలు లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయ. దీని ద్వారా సైప్రస్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలన్నది వారి లక్ష్యం. ఇప్పుడు నరేంద్ర మోదీ నిర్ణయాత్మకమైన చర్య తీసుకోవలసి ఉంది. ఐసిస్ వల్ల రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలకు ఎంత ప్రమాదం ఉందో భారత్‌కు అంతకన్నా ఎక్కువ ప్రమాదం ఉంది. ఢిల్లీపై దాడులు జరుపుత మని ఐసిస్ ఇప్పటికే హెచ్చరికలు చేసింది.

- ముదిగొండ శివప్రసాద్