అనంతపురం

హెచ్చెల్సీ నుంచి సాగునీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, డిసెంబర్ 12: బుక్కరాయసముద్రం మండలం మీదుగా ప్రవహిస్తున్న తుంగభద్ర హెచ్చెల్సీ కెనాల్ కాలువ కింద సాగు చేసిన వేలాది ఎకరాల్లో పంట పొలాలకు శనివారం 22వ డిస్ట్రిబ్యూటర్ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శమంతకమణి, మిడ్ పెన్నార్ ప్రాజెక్ట్ ఛైర్మెన్ కుళ్ళాయిరెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పి.హనుమంతరెడ్డిలు పాల్గొని 22వ డిస్ట్రిబ్యూటర్ కాలువ వద్ద గంగ పూజ చేసి నీటిని విడుదల చేశారు. ఈ కాలువల నుండి మండలంలోని వెంకటాపురం, బొమ్మలాటపల్లి, చెన్నంపల్లి, కొర్రపాడు, కెకె అగ్రహారం, సంజీవపురం, నార్పల మండలంలోని నార్పల, బందలేడు గ్రామాలలో సాగు చేసిన వేలాది ఎకరాలలో వేరుశెనగ పంటకు, ఇతరత్రా ఆరుతడి పంటలకు నీరు వదలడంతో ఆ రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆరుతడి పంటలకు నీటి విడుదలపై హెచ్చెల్సీ డిఈ నటరాజ్‌ను వివరణ కోరగా కలెక్టర్, హెచ్చెల్సీ, ఎస్‌సిల ఆదేశాల మేరకు 18, 19, 20, 21, 22 డిస్ట్రిబ్యూటర్‌ల కాలువలకు 2, 3 రోజులు విడతల రూపంలో ఎండుతున్న పంటలకు ఆరుతడి కోసం నీరు వదలమని ఆదేశాలు రావడంతో ఈరోజు నీటిని విడుదల చేస్తున్నామని అయితే ప్రస్తుతం కాలువలో ప్రవహిస్తున్న నీరు పార్నపల్లి డ్యాంకు తరలించి అక్కడి నుండి కదిరి, నల్లమాడ, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గ ప్రజల తాగునీటి దాహం తీర్చటం కోసమో నీరు అక్కడ నిలువ చేస్తున్నామని అక్కడి నుండి మోటర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు పంపింగ్ చేయటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 10, 15 రోజులపాటు ఈ డిస్ట్రిబ్యూటర్‌ల కాలువలకు విడతల వారీగా నీటిని అందించి రైతులను ఆదుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లికార్జునరెడ్డి, గోవిందరెడ్డి, ఎస్.నారాయణస్వామి, పొడరాల్ల రవీంద్ర, రెడ్డిపల్లి నాయుడు, సోమశేఖర్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. నీటిని విడుదల చేసే సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బుక్కరాయసముద్రం ఎస్సై విశ్వనాథచౌదరి పర్యవేక్షించారు.