అనంతపురం

అనంత టిడిపిలో వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 19:అనంతపురం నగరం ఓవైపు డెంగీ, సీజనల్ వ్యాధుల విజృంభనతో బెంబేలెత్తిస్తుంటే మరోవైపు అధికార పార్టీలోని నేతలు పరస్పరారోపణాస్త్రాలు సం ధించుకుంటుండటంపై నగర వాసు లు విస్తుపోతున్నారు. నగరంలో పారిశుద్ధ్య లోపం, డెంగీ, మలేరియా, విష జ్వరాలు ప్రబలడానికి కారణంగా మేయర్, ఎమ్మెల్యేలంటూ ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి ఆదివారం విలేఖరుల సమావేశంలో చేసిన కామెంట్ అనంతపురం టిడిపిలో సద్దుమణిగిన విభేదాల కుంపటిని మరోమారు రాజేసింది. మేయర్ ఎం.స్వరూప, నగర కమినర్ చల్లా ఓబిలేసు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వి.ప్రభాకరచౌదరికి కుల పిచ్చి పట్టిందని, ఒకే సామాజిక వర్గం వారు కావడంతో బంధుప్రీతి, అవినీతి పెచ్చు పెరిగి పోయాయని, దీంతో అనంతపురం నగరం నాశనమైందంటూ జెసి ఘా టుగా విమర్శించారు. దీంతో గత కొంత కాలంగా మరుగున పడిన వీరి విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. వీరి సమస్యను ఏవిధంగా పరిష్కరించాలో తెలియక జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు జెసి దివాకర్‌రెడ్డి సీనియర్ నేత కావడం, ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి కూడా సీనియర్ కావడం, మేయర్ స్వరూప, కమిషనర్ చల్లా ఓబిలేసుకు ఆయన అండదండగా ఉండటంతో వీరి మధ్య తలదూర్చేందుకు జిల్లా నేతలెవరూ సాహించడం లేదు. అనంతపురం నగరంలో సవాలక్ష సమస్యలు ప్రజల్ని వేధిస్తుంటే.. ఆధిపత్య పోరులో సమస్యల్ని పట్టించుకోకుండా ఒకే పార్టీలోని నాయకులే రచ్చకెక్కడం ఏమిటంటూ జనం బహిరంగంగా చర్చించుకుంటున్నా రు. కాగా జెసి వ్యాఖ్యలపై సిఎం చంద్రబాబునాయుడు సోమవారం సీరియస్ అయినట్లు సమాచారం. పత్రికల్లో వచ్చిన వార్తలతోపాటు జిల్లా పార్టీ నేతలను ఆరా తీసినట్లు సమాచారం. జెసి దివాకర్‌రెడ్డికి మా ట్లాడే అర్హతే లేదని ఎమ్మెల్యే ఆదివారం సాయంత్రమే కౌంటర్ ఇవ్వ డం, సంబంధాలు, బాంధవ్యాలు తమకన్నా ఆయనకే ఎక్కువగా తెలుసని ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి ఎదురు దాడి చేయడం కూడా సిఎం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా సోమవారం మేయర్ స్వరూప కూడా విలేఖరుల సమావేశంలో జెసిపై నిప్పులు చెరిగారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నపుడు ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు, కలెక్టర్ నుంచి కమిషనర్ వరకు ఒకే సామాజిక వర్గం వారిని నియమించుకున్నారని, ఆ విషయం మరిచి పోయారా? అంటూ ప్రశ్నించారు. అవినీతిని నిరూపించాలంటూ ఆమె సవాల్ విసిరారు. నగర పాలక సంస్థలో అవినీతి నిజమేనని, దానిని దశల వారీగా తగ్గిస్తామని ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి చెప్పడం కేవలం ప్రజలను మభ్య పెట్టడానికేనన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే చేతిలో మేయర్ కీలుబొమ్మగా మారిందని, ఆమెను పూర్తిగా డమీ కింద జమ కడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నగర పాలక సంస్థను ప్రక్షాళించేది ఎవరు? ఇటుపార్టీ పరువు కాపాడుకోవడానికి ఏమి చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లుండగా, అటు ప్రజల సమస్యల్ని నెత్తిన వేసుకుని కలెక్టర్ ఒక్కరే పోరాడుతున్నారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రజా సమస్యలు వదిలి ఇలా సొంత పార్టీలో, అదీ అధికారంలో ఉన్న వారే కొట్టుకునేంత స్థాయిని తలపించేలా మాటల తూటాలు పేల్చుకుంటుండటంపై జనం విస్తుపోతున్నారు. నగరాభివృద్ధికి ఎవరు అడ్డుపడినా అది వారి తప్పిదమే అవుతుందని మేథావులు, ప్రతిపక్షాలు హితవు పలుకుతున్నారు. ఎంపి, మేయర్, ఎమ్మెల్యే నడుమ తరచూ రాచుకుంటున్న విభేదాల కుంపటిపై ఆంధ్రభూమి టిడిపి జిల్లా అధ్యక్షుడు బికె.పార్థసారథిని వివరణ కోరగా, పార్టీ పరంగా తగిన విధంగా వ్యవహరిస్తామని అన్నారు. పార్టీలో ఇలాంటి జరుగుతూనే ఉంటాయని, అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటామని అన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీరి విషయంపై నివేదిక కోరినా, విషయం చెప్పాలని రమ్మని చెప్పినా ఆయనకు ఇక్కడి విషయాలు చెబుతామన్నారు. మరి అనంతపురంలో అభివృద్ధి జరుగుతుందా? పారిశుధ్యం మెరుగవుతుందా? శుద్ధమైన తాగునీరు అందుతుందా? పందుల బెడత తీరుతుందా? పొంగి పొర్లుతున్న, చెత్తాచెదారంతో నిండి ఉన్న డ్రైనేజీలు బాగు చేస్తారా, లేదా? తమను ఈ నేతలు పట్టించుకుని ఎపుడు బాగు చేస్తారు? అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల వెడల్పు నెరవేరుస్తారా? జనం పెరుగుతున్నా ఇంకా ఎన్నాళ్లిలా పరస్పరారోపణలో కాలయాపన చేస్తారు? అనే ప్రశ్నలు జనం సంధిస్తున్నారు. నగర వాసులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతను అమాత్యులు మరవకూడదు. మరి ముఖ్యమంత్రి అయినా తగిన చర్యలు తీసుకుని నగరాభివృద్ధికి దిశా నిర్దేశం చేస్తారేమో వేచి చూడాల్సిందే.