అనంతపురం

ప్రైవేట్ చీటీల దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.హీరేహాల్, నవంబర్ 3 : రాయదుర్గం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ చీటీలు నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నియోజకవర్గం పరిధిలో నెలకు దాదాపు రూ.వందకోట్ల వరకూ చీటీల వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ టీచర్లు, పెట్రోల్ బంక్ యజమానులు, ఆలయ కమిటీల సభ్యులు, కుల సంఘాలు, వ్యాపార యూనియన్లతో పాటు మరికొందరు యువత జోరుగా చీటీలు నడుపుతున్నారు. రాయదుర్గం ప్రాంతంలోని గుమ్మఘట్ట, రాయదుర్గం, రాయదుర్గం రూరల్, కణేకల్లు, బొమ్మనహాల్, డీ.హీరేహాల్ మండలాల్లోని ప్రతి గ్రామంలో రూ.లక్షలు, రూ.కోట్ల కొద్దీ చీటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు రూ.50 కోట్ల దందా కేవలం రాయదుర్గంలోనే జరుగుతుందంటే అతిశయోక్తికాదు. చీటీల నిర్వాహకులు బ్యాంకులో వేస్తే 50 పైసలు కూడా వడ్డీ రాదని ఇక్కడైతే నెలకు రూ.2 నుంచి రూ.3 వరకూ వడ్డీ కలిసొస్తుందని ఆశ చూపుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ప్రైవేట్ చీటీల్లో పెట్టిన పెట్టుబడి ‘గాలిలో దీపం’ తయారై భద్రత లేకుండా పోతోంది. చీటీ నిర్వహకుడు నూటికి ఐదు శాతం వంతున కమీషన్ రూపంలో తీసుకుంటాడు. ఈ ప్రకారం రూ.లక్షకు నెలకు 5వేలు వంతున వస్తుంది. ఇలా ప్రతి నిర్వాహకుడు తమ పలుకుబడి, స్నేహితులు, బంధువులతో చీటీలు కట్టించుకుంటున్నారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పెద్ద వరకూ నెలకు 10వేల నుంచి 2.50 లక్షల వరకు కమీషన్ రూపంలో సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సులభతరమైన వ్యాపారానికి పన్నుపోటుగాని ఉండదు. ఎలాంటి లైసెన్స్ ఉండదు. అంతా జీరో వ్యాపారమే. అయితే చీటిల మాటున జనం డబ్బులతో పారిపోవడం, ఐపి పెట్టడం వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నారు. ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో నిర్వాహకులపై ఎలాంటి ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు. చేసేది లేక డబ్బులు పోగొట్టుకుని వౌనంగా ఉండాల్సిన పరిస్థితి. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందు చీటీల నిర్వాహకులు నష్టం వచ్చిందని, డబ్బులు చెల్లించలేమని నోటీసులు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా జనంలో ప్రైవేట్ చీటీల హవా తగ్గలేదు. జనం నాడిని గుర్తించిన చీటీల నిర్వాహకులు ‘కాలం కలిసొస్తే దండుకుంటూ, కలిసిరాకపోతే ఉడాయిద్దాం’ అనే సామెతతో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో రాయదుర్గం పట్టణంలోని ప్రైవేట్ చీటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు నష్టం వచ్చిందని చూపించి జనంతో సేకరించిన డబ్బులను దండుకుని ఉడాయించిన ఘటన తెలిసిందే. అయినా సభ్యులు న్యాయం కోసం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించకపోవడం విశేషం. మరోవైపు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు పటీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నదుల అనుసంధానం చంద్రబాబు ఘనతే..
* జన చైతన్య యాత్రలో మంత్రులు కొల్లు, సునీత
గోరంట్ల, నవంబర్ 3 : దేశంలోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి కేవలం ఐదున్నర నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం మండలంలోని మల్లాపల్లిలో ఏర్పాటు చేసిన జన చైతన్య యాత్రకు పాలసముద్రం నుంచి బైక్ ర్యాలీలో మల్లాపల్లిలో చే రుకున్న మంత్రులు కొల్లుతోపాటు ప రిటాల సునీత, ఎమ్మెల్యే పార్థసారథికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో కొల్లు రవీం ద్ర మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు చివరకు నదుల అనుసంధానాన్ని సైతం అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నా రు. ఆర్థిక నేరాల్లో చిక్కుకున్న జగన్ ఏరోజుకైనా జైలుకెళ్లడం ఖాయమన్నారు. కరవు రైతులను ఆదుకోవడానికి రూ.24 వేల కోట్ల రుణాలను మా ఫీ చేశారన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ అభీష్టం మేరకు రాష్టవ్య్రాప్తంగా కోటి సభ్యత్వాలు పూర్తి చేస్తామన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి సునీత మాట్లాడుతూ ప్రభు త్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురి ంచి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రానున్న జన్మభూమిలో అర్హులందరికీ రేషన్ కార్డులు, దీపం గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వా క్రా రుణమాఫీ చేశామని, ఎన్టీఆర్ భ రోసా కింద పింఛన్లు ఐదు రెట్లు పెం చామన్నారు. హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి జిల్లాలోని అన్ని చెరువులను నీటితో నింపుతామన్నారు. అరాచక కాంగ్రెస్ పాలనలో తన భర్త పరిటాల రవీంద్రతోపాటు మరెందరో అమాయకులను పొట్టన పొట్టుకున్నారని ధ్వజమెత్తారు. నిత్యావసరాలను తీసుకోని లబ్ధిదారుల బియ్యం కార్డులను రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే బికె పార్థసారథి మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న సంక్షేమ పథకాలకు తగిన ప్రచారం లభించలేదన్నారు. కనుక నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఇందిరమ్మ, ఎంపిపి విద్యాధరణి, నాయకులు సోమశేఖర్, యువశేఖర్, నరసింహులు, అమ్మిబాయి, ఉత్తమరెడ్డి, సుబ్బారెడ్డి, నిడిమామిడప్ప తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసరాలు పక్కదారి పడితే చర్యలు
* మంత్రి పరిటాల సునీత
అనంతపురం సిటీ, నవంబర్ 3: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సరుకులు వినియోగదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని, అలా కాకుండా పక్కదారిపడితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్సు హాల్‌లో నుండి జెసి లక్ష్మికాంతంతో కలసి మంత్రి జిల్లాలోని ఆర్‌డిఓలు, డిప్యూటి తహశీల్దార్లు, రేషన్ షాపు డీలర్ల తదితరులతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరుకుల కోసం వెళ్లే కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థలో సక్రమంగా పంపిణీ జరగడం లేదన్న అంశంపై పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలోని కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కొందరు డీలర్ల దుశ్చర్యల వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తున్నట్లు తెలిపారు. మన జిల్లాలో కూడా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం చంద్రబాబు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ధ్యేయంతో ఈ-పాస్ విధానం అమలుచేయడం జరిగిందన్నారు. వినయోగదారులు తాము పొందే సరుకులకు మాత్రమే వేలిముద్రలు వేసి సరుకులను పొందాలన్నారు. అంతేకాని ఒకేసారి వేలిముద్రలు వేసి కొన్ని సరుకులను మాత్రమే తీసుకోవడం సరికాదన్నారు. డీలర్లు కూడా వినియోగదారులకు ఒకేసారి సరుకులన్నింటిని పంపిణీ చేయాలని, అన్ని సరుకులకు వేలిముద్రలు వేసుకుని కొన్నింటినే పంపిణీ చేయడం తన దృష్టికి వచ్చిందని, అలాంటివి ఏ డీలర్లు చేయరాదన్నారు. చౌక దుణాలను ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 4 గంటల నుండి 8 గంటల వరకు తప్పనిసరిగా తెరచి వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అందించాలన్నారు. ఇందుకు విరుద్దంగా ఏ డీలర్లు ప్రవర్తించినా లైసెన్సును రద్దు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల కమీషన్‌ను 20పైసలు నుండి 70 పైసలకు పెంచిందని, తద్వారా ప్రభుత్వానికి ప్రతి యేటా 200కోట్లు అదనపు భారం పడిందన్నారు. నిత్యావసర వస్తువులు గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా పంపిణీ అవుతోందని, కేవలం మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రమే ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఈ అంశాన్ని జెసి, ఆర్‌డిఓ, ఎంఆర్‌ఓలు పరిశీలించి వాటిని ఆరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఫిర్యాదులు అందిన 8 మంది డీలర్లపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ మలోలా, డిఎస్‌ఓ ప్రభాకర్, తహాశీల్దార్ శ్రీనివాసులులు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని 28వ వార్డు చౌక ధరల దుకాణం(91)ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ వున్న రికార్డులను, బయోమెట్రిక్ మిషన్‌ను, బియ్యం, చక్కెర, గోధుమ పిండి ప్యాకెట్ల తూకాలను సక్రమంగా వున్నాయో లేదా అన్న విషయాలను మంత్రి పరిశీలించారు. అనంతరం చౌక దుకాణానికి వచ్చిన వినియోగదారులతో సరుకులన్ని సకాలంలో సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీలరు లక్ష్మికాంత్ మాట్లాడుతూ బియ్యం, చక్కెర, గోధుమ పిండి మాత్రమే తీసుకుని కిరోసిన్ మరోసారి వచ్చి తీసుకుంటామని వినియోగదారులు తెలుపుతున్నారని, ఒకేసారి అన్ని సరుకులు తీసుకెళ్లడం వల్ల కిరోసిన్ వాసన వస్తుందనే అభిప్రాయాన్ని మంత్రికి తెలిపారు. ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ వినియోగదారులకు అనుకూలంగా కిరోసిన్‌ను వేయాలని సూచించారు. అయితే పక్కాదారి పట్టించకుండా తప్పకుండా కిరోసిన్‌ను వినియోగదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర తహశీల్దారు శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోండి
* మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి
అనంతపురం సిటీ, నవంబర్ 3: నానాటికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక కురుగుంటలో గల బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మాగ్నెట్ జూనియర్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న సైన్సుఫేర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రపపంచంలో సైన్సుకు ప్రత్యేక స్థానం ఉందని, భారతదేశంలో విజ్ఞానానికి, మేథాసంపత్తికి కొదవలేదని, అమెరికాలో పనిచేస్తున్న ప్రతి నలుగురి బారతీయల్లో ఒకరు ఏపికి చెందిన వారు ఉండటం విశేషమన్నారు. చిన్నచిన్న ఆలోచనలతో భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడేలా ప్రయోగాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది విద్య అని, విద్య బవిష్యత్తులో దశ, దిశను నిర్ధేశిస్తుందన్నారు. సాంకేతిక రంగంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని, త్వరలో ఫైబర్ గ్రిడ్‌ను రాష్ట్రంలో తీసుకువస్తున్నామని, దీంతో ప్రతి ఒక్కరికి నెట్, టివి, ఫోన్ అతి చౌకగా అందుతాయన్నారు. ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజి కన్వీనర్ ఉషారాణి, జోనల్ అధికారి గీతావాణి, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
భయపడొద్దు.. కరవును తరిమేస్తాం...
* మంత్రి పల్లె రఘునాథరెడ్డి
నల్లమాడ, నవంబర్ 3: చెరువులకు నీళ్లు నింపి కరవును తరిమికొట్టి పుట్టపర్తిని కరవు రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదని ఐటీ శాఖామాత్యులు పల్లె రఘునాథరెడ్డి అన్నా రు. గురువారం మండలంలోని బాస ంవారిపల్లిలో జరిగిన జన చైతన్య యాత్రలో మంత్రి మాట్లాడుతూ ఎన్న డూ లేని విధంగా వర్షాభావ పరిస్థితు ల కారణంగా జిల్లాలో రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రాబోయే రోజు ల్లో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా వుండాలంటే చెరువులకు నీళ్లు నింపడమే మార్గమన్నారు. హంద్రీనీవా ద్వార బుక్కపట్నం చెరువును నింపి అక్క డి నుంచి నల్లమాడ, ఓడిచెరువు, ఆమడగూరు మండలాల్లోని అన్ని చెరువులకు నీళ్లు చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ముఖ్యమంత్రి కూడా అందుకు ఆమోదించారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నీళ్లు వుంటే రైతన్నలకున్న ఎర్ర నేలల్లో బం గారాన్నైనా పండిస్తారన్నారు. ఎంత ఖర్చు అయినా భరించి తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఏ ఒక్క కుటుంబంలోనైనా ఎవరైనా ప్రమాదానికి గురై మృతి చెందితే వారి కుటుంబానికి ఆస రా కల్పించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబునాయుడు చంద్రన్న బీమాను ప్రవేశపెట్టారన్నారు. ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే చంద్రన్న బీమా ద్వారా రూ. 5 లక్షలు వెంటనే అందజేస్తామని, ప్రతి ఒక్కరూ చంద్రన్న బీమాలో నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా టిడిపిలో సభ్యత్వం వున్న వ్యక్తులకు కూడా ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. 2 లక్షలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ లోటు వున్నా కూడా రాష్ట్ర ప్రజానీకానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండటం మనమందరం చేసుకున్న అదృష్టమన్నారు. ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు, అర్హులందరికీ రూ. 1000, 1500ల పింఛన్లు, ఇళ్లు లేని వారికి ఇళ్లు, పేదలకు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, నీటి సమస్య అధికంగా వున్న అనంతపురం జిల్లాలో నీటి కష్టాలను పారదోలడానికి వందల కోట్లు వెచ్చించి హంద్రీనీవా కాలువలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఉపాధికి అవసరమైన రుణాలు ఇలా ఎన్నో పథకాలను ప్రజలకందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అగిశం ప్రతాప్, మంజునాథరెడ్డి, కేశవరెడ్డి, కులశేఖర్ నాయుడు, అంజీప్రసాద్, సర్వేయర్ గంగాద్రి, అగ్గి నరసింహులు, పాపారాయుడు, సలాంఖాన్, హరిక్రిష్ణ, అబ్బాస్‌ఖాన్, ఎల్‌ఐసి నరసింహులు, బాబావలిఖాన్, సోమిరెడ్డి, విరూపాక్షిరెడ్డి, గెన్రెడ్డి, గంగిరెడ్డి, శివారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి కృషి
* ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్
ఉరవకొండ, నవంబర్ 3 : కరవు కోరల్లో చిక్కుకున్న రైతన్నను ఆందుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. గురువారం మండలంలోని చిన్నముష్టూరు గ్రామం వద్ద ఉన్న హంద్రీనీవా సుజల స్రవంతి కాలవలోని డి1 డిస్ట్రిబ్యూటరీ నుంచి కృష్ణాజలాలకు పూజలు చేసి పెద్ద పంపునకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర జలాశయం నిర్మించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. హెచ్‌ఎల్‌సి, జిబిసి కాలువ కింద ఉన్న ఆయకట్టు భూముల్లో వేలాది ఎకరాల్లో మిర్చి, వరి పంటలు సాగుచేశారన్నారు. అయితే పంటలు చేతికి వచ్చే సమయంలో సాగునీరు అందకపోవడంతో వేసిన ఎండిపోతున్నాయన్నారు. రైతులను ఆందుకునేందుకు ప్రభుత్వం హంద్రీనీవా కాలువ ద్వారా వంకలు, చెరువులకు నీటిని మళ్లిస్తున్నట్లు తెలిపారు. నియోజవర్గ పరిధిలోని పాల్తూరు, హావళిగి, ఉండబండ, గ్రామాల వద్ద వేసిన దాదాపు 4వేల ఎకరాలలో మిర్చి పంటను కాపాడటానికి హంద్రీనీవా ద్వారా నీటిని మళ్లిస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో హంద్రీనీవా నుంచి జిబిసి కాలవకు నీటిని అనుసంధానం చేసి సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విడపనకల్లు ఎంపిపి దాసరి ప్రతాప్‌నాయుడు, సాగునీటి సంఘం అధ్యక్షులు కాలువ మారెయ్య, మాజీ విద్యాకమిటీ చైర్మన్ సరుసాబ్, టిడిపి నాయకులు చిన్నమారెయ్య, పాటిల్ శశిగౌడ్, ఉరవకొండ ఎంపిపి సుంకురత్నమ్మ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ దేవినేని పురుషోత్తం, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శంకరప్ప, మాజీ సర్పంచు లత్తవరం గోవిందు, నాగరాజు, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.
సబ్‌జైళ్లలో సౌకర్యాల మెరుగుకు కృషి
* జిల్లా జైళ్లశాఖ అధికారి సుదర్శన్‌రావు
హిందూపురం టౌన్, నవంబర్ 3 : జిల్లాలోని సబ్‌జైళ్లలో సౌకర్యాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జైళ్ల శాఖ అధికారి సుదర్శన్‌రావు తెలిపారు. రూ.22 లక్షల వ్యయంతో ఆధునీకరించిన స్థానిక సబ్‌జైలు గదులను అదనపు జిల్లా జడ్జి రాములు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడితో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం సబ్‌జైలు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మానసిక ప్రశాంతత కోసం ఉదయం వేళల్లో యోగా చేయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా త్వరలోనే పెనుకొండ సబ్‌జైలులో ఖైదీలతో పెట్రోలు బంక్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖైదీలు జైళ్లలో ఉన్నామన్న రీతిలో కాకుండా ఇంటి వాతావరణాన్ని కల్పించి వారిలో సత్ప్రవర్తన కలిగించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, జైళ్ల శాఖ అధికారులు పాల్గొన్నారు.
పేదల అభివృద్ధే టిడిపి లక్ష్యం
* మంత్రి సునీత
రాప్తాడు,నవంబర్ 3: పేద ప్రజల అభివృద్ధే తెదేపా లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని మరూరు గ్రామంలో నిర్వహించిన జన చైతన్య యాత్రల్లో మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల కోసమే దివంగత నేత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చారని, అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల కోసమే పనిచేస్తోందని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజన జరిగి రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. చంద్రన్న బీమా పథకం ద్వారా వివిధ వృత్తులో ఉన్న రెండు కోట్ల మంది అసంఘటిత కార్మికులకు రూ.5లక్షల బీమా పరిహారం అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్, వైస్ ఎంపీపీ గవ్వల పరంధామ, మండల కన్వీనర్ నారాయణస్వామి, సర్పంచిలు వెంకటరాముడు, గోపాల్, శ్రీనివాసులు, ఎంపీపీ శీను, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా హంపి ఉత్సవాల శోభాయాత్ర
బళ్లారి, నవంబర్ 3 : ప్రపంచ ప్రఖ్యాతగాంచిన హంపి ఉత్సవాల శోభాయాత్ర గురువారం ఘనంగా సాగింది. డోలు వాయిద్యాలు, ధార్మిక సాంస్కృతి, మహిళల పూర్ణకుంభాలు, జానపద కళాకారుల నృత్యాలు, జానపద సంప్రదాయాలతో సాగిన శోభా యాత్ర హంపి ఉత్సవాలకు మెరుగులు తెచ్చింది. సాయంకాలం 5గంటలకు విరూపాక్షేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర హంపి పురవీధుల గుండా ఎదురుబవన్న ఆలయానికి చేరుకుంది. ఈ ఉత్సవ ఊరేగింపులో నగర ప్రముఖులు, నగర ప్రజలు, విదేశీయుల పాల్గొన్నారు. వీధుల్లో ప్రజలు బారులుతీరి యాత్రను వీక్షించారు. అంతేగాకుండా నగర వీధుల్లో వివిధ పుస్తకాల ప్రదర్శన, వివిధ రకాల దుకాణాలు హంపి ఉత్సవానికి శోభను తీసికొచ్చాయి. మూడు రోజుల వరకూ జరగనున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాల నుంచి ప్రజలు తరలిరానున్నారు.
వర్షాలు కురవాలని కోరుకున్నా.. : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
రాష్ట్రంలో కరవు విలయ తాండం చేస్తున్న నేపథ్యంలో వర్షాలు కురవాలని విరూపాక్షిదేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గతేడాది సైతం రాష్ట్రంలో కరవ నెలకొనగా సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. ఇందులో భాగంగా ఏడాది కూడా పశువులకు మేత, తాగునీరు, ఉపాధి కల్పన వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్లు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 139 తాలూకాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు తెలిపారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ నిబంధనల ప్రకారం రూ.4వేల కోట్లు పరిహారంగా మంజూరు చేయాలని కేంద్రానికి విన్నవించామన్నారు. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రులు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందించినట్లు గుర్తు చేశారు. బళ్లారి జిల్లాలోని అన్ని తాలూకాల్లో కరవు ఏర్పడడంతోత్వరలో పరిహారం పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇకపోతే హంపికి వచ్చే పర్యటకులకు కనీస వౌలిక వసతులతోపాటు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళలు, సాంస్కృతికి పుట్టినిల్లుగా నిలిచిన కర్నాటకాలో కళాకారులకు ప్రోత్సాహం అప్పటి విజయనగర సామ్రాజ్య రాజుల నుంచి ఉంటోందని గుర్తు చేశారు. అనంతరం ముఖ్యమంత్రితోపాటు మంత్రులు మహాదేవప్రసాద్, ప్రియంకఖర్గే, మహదేవప్ప తదితరులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్‌లాడ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రామ్‌ప్రశాంత్ మనోహర్, ఎమ్మెల్యేలు తుకారం, నాగరాజు, భీమానాయక్, గోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు కొండయ్య, అల్లం వీరభద్రప్ప, జిల్లా పంచాయతీ అధ్యక్షులు భారతి తిమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు దీనా మంజునాథ్, జిందాల్ వినోద్‌నావెల్ తదితరులు పాల్గొన్నారు.
యువకుడి అనుమానాస్పద మృతి
కదిరి, నవంబర్ 3: పట్టణంలోని అడపాల వీధి సమీపంలో గురువారం రైలు పట్టాలపై వెంకటరమణ (25) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాబా కాలనీకి చెందిన వెంకటరమణ, స్వప్న అనే మహిళతో సహజీవనం చేసేవాడని, ఈ క్రమంలో చిన్నపాటి గొడవలు జరగడంతో స్వప్నకు సంబంధించిన పాస్‌పోర్ట్‌ను వెంకటరమణ తీసుకెళ్లాడు. ఈ విషయమై ఆమె పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెంకటరమణను పోలీసులు పిలిపించి విచారణ చేశారు. దీంతో వెంకటరమణ మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా హత్య చేసి రైలు పట్టాలపై పడేశారా? అన్నది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి వుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుంతకల్లురూరల్, నవంబర్ 3 : గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో గురువారం 45 సంవత్సరాలు వయస్సు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. చెన్నై నుంచి ముంబై వెళ్తున్న 16382 జయంతి ఎక్స్‌ప్రెస్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు తెలుసుకున్న జిఆర్‌పి పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు