అనంతపురం

నగరాన్ని నాశనం చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, నవంబర్ 4:ప్రజలను మేల్కొలిపి చైతన్యపరచాల్సినవారే మొద్దునిద్ర పోతూ అక్రమాలకు పాల్పడుతూ అనంత నగరాన్ని నాశనం చేస్తున్నారని ఎంపి జెసి.దివాకరరెడ్డి వాపోయారు. వంకలలో పూడికతీత పనులు చేస్తుంటే చెత్తచెదారాలతోపాటు ప్లాస్టిక్‌వ్యర్థాలు లెక్కకు మించి కనపడుతున్నాయన్నారు. ప్రజాధనం లక్షలకు లక్షలు వెచ్చించి పూడికతీత పనులను ఇప్పటివరకు నిర్వహించారని అన్నారు. వాటి వలన ప్రజాధనం దుర్వినియోగం కావటం తప్ప ఒరిగిందేమి లేదన్నారు. నడిమివంకలో స్థానికులు చెత్తపారవేయటాన్ని గమనించి వారిని మందలించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన స్థానిక కార్పొరేటర్ భర్త గంగాధర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంకలోకి చెత్తచెదారాలు, ప్లాస్టిక్ కవర్లు వేస్తుంటే స్థానికులను చైతన్యపరచకుండా ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక 40వ డివిజన్ పరిధిలోని ఆజాద్‌నగర్ అంతా కలియతిరిగారు. మరువవంకతోపాటు శుక్రవారం నడిమివంకలో పూడికతీత పనులను మూడు ప్రొక్లైన్లతో చేపట్టారు. మరువవంక పూడికతీత పనులు శుక్రవారం సాయంకాలంనాటికి పూర్తీ అయితే మిగతా 15 ప్రొక్లైన్లను శనివారం నడిమివంకకు తరలిస్తామని తెలిపారు. ఆజాద్‌నగర్‌లో ఇంటింటికి తిరిగి చెత్తచెదారాలను కాలువలు, వంకలలోకి పారవేయటం వలన మన అనారోగ్యాన్ని మనమే కొనితెచ్చుకున్నట్లు అవుతుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా సహకరించాలన్నారు. కోట్లు వ్యయం చేసి వంకలలో పూడికతీయటం, ప్రొటెక్షన్‌వాల్స్ నిర్మిస్తే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వంకలలో, కాలువలలోకి చెత్తవేయటం వలన మురుగునీరు నిలిచిపోతుందన్నారు. దోమలు వృద్ధి చెందుతాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రోగాలు వస్తే ఇబ్బందులు పడేది ప్రజలమైన మనమేనన్నారు. ఇప్పటికైనా పాత అలవాట్లను మానుకుని చెత్తను బుట్టలలోకి వేసి కుండీలలో పారవేయాలన్నారు. లేదా ఇంటింటి చెత్తసేకరణకు వచ్చే రిక్షాలకు అందించాలన్నారు. ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతను పరిరక్షిస్తే స్వచ్ఛ అనంతపురం సాధ్యమవుతుందన్నారు. మన ఊరు-మన శుభ్రత-మన ప్రజలు అన్న విషయాలను మరువరాదని హితవుపలికారు. వంకలను శుభ్రం చేయిస్తున్నాం. వాటిలోకి చెత్తవేయకుండా చూడాలన్నారు. చెత్త వేసినవారి ఇంటి వద్ద నిలదీయాలన్నారు. ఇకపై వంకలలో చెత్త వేయటం మానుకోకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.