అనంతపురం

హోంగార్డుల సంక్షేమం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 7: జిల్లాలోని పోలీసు శాఖలో పని చేస్తున్న హోంగార్డుల సంక్షేమం భేష్‌గా సాగుతోందని కర్నూలు హోంగార్డుల విభాగం కమాండెంట్ చంద్రవౌళి అన్నారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం అనంతపురం వచ్చిన ఆయన స్థానిక హోంగార్డు కార్యాలయాన్ని తనఖీ చేశారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా ఎస్పీ ఎస్‌వి.రాజశేఖరబాబు ఆధ్వర్యంలో సంక్షేమ చర్యలు బాగా అమలవుతున్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా పోలీసు సబ్ డివిజన్ల వారీగా జిల్లాలోని హోంగార్డుల విధులు, తదితర అంశాలపై ఆయా ఇన్‌చార్జ్‌లతో సమీక్షించారు. సమావేశంలో ఎఆర్ డిఎస్పీ చిన్నికృష్ణ, హోంగార్డుల ఇన్‌చార్జ్ ఆర్‌ఎస్‌ఐ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి సునీత రాక

రామగిరి, నవంబర్ 7: మంత్రి పరిటాల సునీత మంగళవారం రామగిరికి రానున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. ఆమె రామగిరిలో జరిగే జనచైతన్యయాత్రల్లో పాల్గొంటారని, పరిటాల రవీంద్ర ఇండోర్ స్టేడియంలో జరిగే జోన్ 4 గ్రిగ్స్ పోటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆ పార్టీ వర్గాలు కోరాయి.

ప్రజాసంక్షేమమే టిడిపి ధ్యేయం

కదిరి, నవంబర్ 7: ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయమని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా అన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా సోమవారం పట్టణంలోని 24, 25, 26వ వార్డుల్లో జనచైతన్య యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, టిడిపి సీనియర్ నాయకులు ఎస్‌ఎండి ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు రెండు కళ్లు అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తూ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల కష్టాలను చూసి వారు తీసుకున్న రుణాలను మాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్, కాపులు, వడ్డెర్లకు ఫెడరేషన్ల ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేసి, వారికి సంక్షేమ పథకాలు అందేలా చూడడమే ఈ జనచైతన్యయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాటం శంకర్, కె.యం జిలాన్ ఖాన్, ఆల్ఫా ముస్త్ఫా, జైనుల్లా, ఇటికెల ఇలియాజ్, ఇంతియాజ్, కౌన్సిలర్లు శివశంకర్ నాయక్, మైనుద్దీన్, రొద్దం సర్‌తాజ్, నూర్జాహాన్‌లతో పాటు పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

పుట్టపర్తి, నవంబర్ 7: పారిశుద్ధ్యంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి హెచ్చరించారు. సోమవారం పుట్టపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులతో ఆడిట్‌పై పర్యవేక్షణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానంగా స్వచ్చ్భారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని వంద శాతం పూర్తి అయ్యేలా చూడాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. చెత్త సేకరణకై రిక్షాల ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. సత్యసాయిబాబా జయంతి వేడుకలను పురస్కరించుకొని సాయిభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 23న జరగనున్న సత్యసాయిబాబా జయంతి వేడుకలను మున్సిపాలిటీ పరంగా తీసుకునే చర్యలపై ఆమె ఆరా తీశారు. దేశవిదేశాల నుంచి ఇక్కడకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పబ్లిక్‌హెల్త్ ఇఇ శ్రీనాథరెడ్డి, డిఇ గోపాల్‌నాయుడు, మున్సిపల్ కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి, ఇంజినీర్ నరసింహమూర్తి, అధికారులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
* జిల్లా టిడిపి అధ్యక్షుడు బికె పార్థసారథి

గోరంట్ల, నవంబర్ 7: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే, జిల్లా టిడిపి అధ్యక్షుడు బికె పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని బూదిలిలో జరిగిన జన చైతన్య యాత్రలో మాట్లాడుతూ బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు మరెన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులు, మహిళా సంఘాలకు రుణమాఫీ చేశామన్నారు. అదే విధంగా నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించామని, అయితే అభివృద్ధి నిరోధకులు కొంతమంది అడుగడుగునా అడ్డుతగులుతున్నారని విమర్శించారు. గోరంట్ల మండల ప్రజల ఆకాంక్ష మేరకు సాగు, తాగునీరు అందించడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి సాగునీరు అందించడానికి రూ.260 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి విద్యాధరణి, జడ్పీటీసీ ఇందిరమ్మ, ఉపాధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, నాయకులు యువశేఖర్, సోమశేఖర్, ఉత్తమరెడ్డి, సుబ్బారెడ్డి, రవినాయక్, బాలకృష్ణచౌదరి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.