అనంతపురం

యథేచ్ఛగా ఇసుక రవాణా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, ఫిబ్రవరి 18: పామిడి పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా సర్వసాధారణమైంది. ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం పటిష్టమైన విదానాన్ని అమలుపరచకపోవటం కారణంగా ఇసుక అక్రమ రవాణాను ఎవరూ నివారించలేక పోతున్నారు. అప్పుడప్పుడు దాడులు చేయటం లక్ష్యాలు సాదించామంటూ అధికారులు ప్రకటించుకోవటం పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి. ప్రకృతి ప్రసాదించిన ఇసుక కనుమరుగైతే భూగర్భ జలాలు అడగంటిపోయి భవిష్యత్తులో తాగునీటి పథకాలకు ముప్పు వాటిల్లుతూ గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులు నెలకొనటం ఖాయమంటూ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతం నుండి వై.టి.చెరుపు, నంద్యాల, సత్యసాయి, సిపిడబ్ల్యూఎస్ తాగునీటి పథకాలకు సంబందించి సంపులుండగా వాటి ద్వారా ఆయా ప్రాంతాలకు ఇక్కడి నుండే తాగునీరు సరఫరా అవుతోంది. పామిడి ప్రాంతానికి చెందిన ట్రాక్టర్లను గుంతకల్లు వారు అడ్డుకోవటంతో గుంతకల్లు, పామిడి ట్రాక్టర్ల వారు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని దేవరపల్లి సమీపంలోని కోయిలదినె్న ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో పామిడి ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తూ డంప్ చేస్తుండగా అక్కడి నుండి గుంతకల్లు చెందిన ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తుండటమే ఇందుకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఇకపోతే రైల్వే వంతెన జాతీయ రహదారి, పామిడి - కల్లూరు కాజ్వే వంతెనలున్నాయి. పెన్నా నది పరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక అక్రమంగా రవాణా అవుతుండటంతో వీటన్నింటికీ పెనుప్రమాదం ముంచుకొస్తోంది. పెన్నా నది నుండి ఇసుకను అక్రమంగా తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఇసుక కోసం పెన్నాలోకి ప్రవేశం లేదని ఆ ప్రాంతం నిషేధిత ప్రాంతంగా అధికారులు ప్రకటించారే కానీ పర్యవేక్షణను మరిచారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే అధికారాన్ని ప్రభుత్వం గనులు భూగర్భ శాఖలకు అప్పగించటం తెలిసిందే. రెవెన్యూ, పోలీస్, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ అక్రమ ఇసుక రవాణాను నివారించాల్సి వుంది. అయితే గనులు భూగర్భ శాఖ వారు ఇక్కడ దాడులు జరిపిన సందర్భాలు లేకపోగా పోలీసులు వారికొచ్చిన సమాచారం మేరకు అక్రమ ఇసుక రవాణాపై దాడులు చేస్తూ పట్టబడ్డ ట్రాక్టర్లను గనులు భూగర్భ శాఖ వారికి అప్పగిస్తుండటం వారు అపరాద రుసుమును విధిస్తుండటం షరా మామూలే. పట్టణాభిద్ధే ధ్యేయమంటూ పెన్నా నుండి ఇసుక తరలింపును అడ్డుకుంటామని శపథం చేస్తూ ఎన్నికైన పట్టణాభివృద్ధి కమిటీ జాడనే లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రికి రాత్రే కొందరు అక్రమ ఇసుక రవాణాదారులు జెసిబిలతో ఇసుకను ట్రాక్టర్లలో లోడ్ చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం, పట్టణాభివృద్ధి కమిటీ మీనమేషాలను లెక్కిస్తున్నాయన్నది పలువురి వాదన. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి దేవరపల్లి సమీపంలోని కోయిలదినె్న ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఇసుకను డంప్ చేస్తున్న వారితోపాటు అక్కడి నుండి గుంతకల్లుకు ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుని పెన్నా నది నుండి అక్రమంగా ఇసుక తరలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా వుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

విభేదాలు వీడండి!
* జిల్లా నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్

అనంతపురం, సెప్టెంబర్ 18 : విభేదాలు వీడి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబా బు జిల్లా నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. శనివారం విజయవాడలోని తన కార్యాలయంలో జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సభ్యులతో సిఎం సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 7.30 గంటల వరకూ జిల్లా పార్టీ తీరుతెన్నులు, పటిష్టత, నేతల మధ్య నెలకొన్న విభేదాలు, రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే విషయాలపై చంద్రబాబు సుదీర్గంగా చర్చించారు. ఈ సమావేశానికి ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలకృష్ణ, జితేంద్రగౌడ్ మినహా మంత్రులతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతల మధ్య నెలకొన్న విభేదాలపై సిఎం ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలకు ఓ విధంగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ పరంగా రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా మంచి స్థానంలో ఉందని కితాబిచ్చినట్లు తెలిసింది. సిఎం వద్ద ఉన్న చిట్టా మేరకు జిల్లాలో పార్టీ పనితీరుపై దాదాపు 90 శాతం మార్కులు వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విభేదాలపై మంత్రి సునీత, ధర్మవరం ఎమ్మెల్యే సూరి, పెనుకొండ ఎమ్మెల్యే బికె, ఎంపి నిమ్మల, అనంత ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, కదిరి ఇన్‌చార్జి కందికుంట తదితరులతో సుదీర్ఘంగా సమావేశమై చర్చించినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అందరూ సమానంగా తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలో వ్యక్తిగత కుమ్ములాటలు ఉండరాదని, చిన్న చిన్న సమస్యలే కనుక ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ సర్దుకుపోవాలని సూచించారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో కదిరి నుంచి కందికుంటకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు సిఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలో అసమ్మతిపై రచ్చకెక్కకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శిగా పని చేస్తున్న వెంకటరాముడు సేవలను పలువురు ఎమ్మెల్యేలు సిఎం దృష్టికి తీసుకెళ్లగా సంతృప్తి చెందిన చంద్రబాబు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌లలో ఏదో ఒక పదవి ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యతను మీదేనంటూ సూచించినట్లు సమాచారం. అయితే స్థానిక ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయాలన్న అంశంపై చర్చకు రానట్లు తెలుస్తోంది.
34కు చేరిన ఎమ్మెల్సీ నామినేషన్లు
* 6వరోజు 16 దాఖలు
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 18: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి శనివారం రోజున 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్స్‌కు 12 మంది , ఉపాధ్యాయ నియోజక వర్గానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లును దాఖలు చేశారు. గత ఆరు రోజుల్లో మొత్తం 34 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్లును దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి సంబందించి 23 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబందించి 11 మంది అభ్యర్థులు నామినేషన్లును దాఖలు చేశారు. శనివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కడప జిల్లాకు చెందిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ఆర్.వై.కొండయ్య, అనంతపురం జిల్లాకు చెందిన కె.మల్లిఖార్జునరెడ్డి, వడ్ల కేశవయ్యలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లును దాఖలు చేశారు. అలాగే గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి టి.పుల్లన్న, ఇ.సోమశేఖర్, జి.హరికృష్ణ, ఎం.గంగులప్ప, ఎన్.వెంకటసానెమ్మ, ఎస్.విజయభాస్కర్, పి.జగన్నాథం, ఎం.శ్రీనివాసులు, ఎన్.నరసింహం, కోటేశ్వరరెడ్డి, బి.రంజీత్‌కుమార్, ఎం.జయరామయ్యలు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లును దాఖలు చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి నామినేషన్
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంరెడ్డి సుబ్బారెడ్డి శనివారం అట్టహాసంగా నామినేషన్‌ను దాఖలు చేశారు. అంతకుముందు నగరంలోని శివబాలయోగి ఆశ్రమంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, సిపిఎస్ రద్దుకు పోరాటాలు చేస్తామని తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు. మూడు జిల్లాల్లోని పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు సోమశేఖర్‌రెడ్డి, జోజిరెడ్డి, హనుమంతురెడ్డి, రఘురామిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డ, పురుషోత్తంరెడ్డి, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
దక్షిణకాశీ.. శ్రీబుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం
* నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తాడిపత్రి, ఫిబ్రవరి 18: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కొంగు బంగారంలా పిలువబడుతున్న శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. ఈ ఆలయం వద్ద పెన్నా నది ఉత్తర, దక్షిణ దిశగా ప్రవహిస్తుండటంతో దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచింది. 14వ శతాబ్దంలో విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవారాయలు వారిచే నిర్మితమైన అతిసుందరమైన ప్రాచీన శైవ క్షేత్రం. విజయనగర చక్రవర్తుల కళాభిమానాన్ని నేటికి సజీవంగా సాక్షాత్కరింపజేయడంలో తాడిపత్రిలోని శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రథమస్థానంలో నిలుస్తోంది. రామాయణంలో యాగరక్షణ భారం వహించడానికి విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు ఈ ప్రాతంలో ప్రయాణిస్తుండగా తాటకి అను రాక్షసి అడ్డుపటంతో సంహరించారు. స్ర్తి హత్య దోష నివోరణ కోసం పెన్నా నది ఒడ్డున స్వయంభువుగా వెలసిన శివలింగాన్ని గుర్తించి ప్రతిష్ఠగావించి పూజలు నిర్వహించినట్లు పురాణాలు తెలుపుతాయి. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన శివుడు కావడంతో రామలింగేశ్వరునిగా పిలుస్తారు. లింగోద్భావ స్థానంలో నీటి బుగ్గ ఉండి నిరంతరం నేటికి నీరు ఉబికి వస్తుండటంతో బుగ్గరామలింగేశ్వరస్వామిగా ప్రసిద్ధి పొందారు. పురాతన చరిత్ర కలిగిన వైశిష్టతకు సాక్షిభూతాలుగా నిలిచిన ఆలయం పెన్నా నది ఒడ్డున దాదాపు 25 అడుగుల ఎత్తులో ఉంది. పెన్నా నదిలో నీరు లేకపోయిన ఆలయంలో స్యయంభూవు లింగం ఉద్భవస్థానం నుంచి నేటికి సర్వకాలముయందు నీరు పైకి ఉబికి వస్తూంటుంది. ఈ దేవాలయం వద్ద పెన్నా నది ఉత్తర, దక్షిణాలుగా ప్రవహిస్తూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది. విజయనగర శిల్పకళారీతులు, సంస్థాన వైభవం నేటికి సాక్షాత్కరింప జేయడంలో శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రథమస్థానంలో నిలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయుల విజయ చిహ్నాలైనా వరాహ ం, సూర్యబింబం, చంద్రవంకలను ఆలయం పడమటి గోడలపై ఇరువైపులా చెక్కించారు. ముఖ ద్వారంలో ప్రవేశించగానే పుష్పమాలాధారులైన సుందరీమణులు వివిధ నాట్యభంగిమలలో నిలచిన శిల్పాలు స్వాగతం పలుకుతాయి. ముఖ ద్వారం ఎదురుగానున్న రంగ మండపానికి ఇరువైపులా దీర్ఘచతురస్రాకార వేదికపై సీతారామలక్ష్మణుల ఆలయం, మరోవైపు శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం ద్విగునీకృతమైన అందాలతో అలరాడుతుంది. ఈ ఆలయంలో మూలవిరాట్ పశ్చిమాభి ముఖంగా వెలసియున్నాడు. ధ్వజస్తంభానికి పశ్చిమ భాగాన విజయనగర రాజుల వంశ వృక్షాల వివరా లు చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయ ంలో వీరభధ్ర స్వామి, పరశురాముడి ఆలయాలు ఉన్నాయి. రామాలయం, రాజరాజేశ్వరీదేవిల ఆలయాలకు ఎదురుగా ఉన్న సభా మండపంలో ఉన్న రాతి స్తంభాలు అన్నీ ఒక్కో రీతిలో మలచి ఉండగా ఒక్కో స్తంభానికి నాలుగు స్తంభాలు వేర్వేరుగా మలచియున్నారు. వాటిని నిశితంగా పరిశీలించి చూస్తే ఒక్కో స్తంభం ఒక్కో రీతిలో మలచి ఉన్నాయి. వాటిని రాతితో స్మృశిస్తే ప్రతి చిన్న స్తంభం వేర్వేరు స్వరాలను పలకడం విశేషంగా చెప్పవచ్చును. దక్షిణ ద్వారం గోడలపై చెక్కిన దేవ, దానవ సంగ్రామాన్ని కనులకు కట్టినట్లు చూడవచ్చు. విచిత్రమైన రీతిలో చెక్కిన అర్దనారీ విష్ణువు, పంచ ముఖాల గణపతి, కంచిలో వెలసిన బంగారు బల్లి రీతిలో రాతి బల్లి తదితర శిల్పాలు అలనాటి సృజనాత్మకతకు ఊహాశక్తికి అద్దంపడుతాయి. ఉత్తరం వైపున రాజగోపురం కూడ్యాలపై ప్రకృతి అంశాలతో కూడిన శిల్పాలు, ద్వారపాలకులు, ఘనాధిపతుల విగ్రహాలు, జంతువులు, పక్షులతో పెనవేసుకున్న లతలతో, బహువృత్తాలతో బహు సుందరమైన తోరణాలతో సందర్శకులను ఆశ్ఛార్యానొందిస్తాయి. అపూర్వమైన శిల్పకళా సంపద పొందుపరిచిన శిల్పకళా ఖజానా శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని తప్పక సందర్శించి తీరాల్సిందే.
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
శ్రీ బుగ్గరామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు 19న ప్రారంభమవుతాయని దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. ఈ నెల 19న సాయంత్రం అంకురార్పణం, శైవ పుణ్యాహవచనం, 20న సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి చిత్రగోపురం గ్రామోత్సవం, 21న రాత్రి శేషవాహనం, 22న సింహ వాహనం, 23న నరమృగ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. 24న మహాశివరాత్రిని పురస్కరించుకొని పగలు నంది వాహనం, రాత్రి అధికార నంది వాహనం, రాత్రి 11గంటలకు శివజ్యోతి దర్శనం, రాత్రి 12గంటలకు లింగోద్భవ కాల అభిషేకం, 25న గజ వాహనం, 26న ఉదయం శివపార్వతుల కల్యాణోత్సవం, సాయంత్రం మహారథోత్సవం, 27న అశ్వ వాహనం, 28న పగలు వసంతోత్సవం, రాత్రి హంస వాహనం, మార్చి 1న రాత్రి ఏకాంతోత్సవం నిర్వహించబడుతాయని తెలిపారు.