అనంతపురం

గ్రామాల్లో సామాజిక సమానత్వం పెంపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఏప్రిల్ 10: ప్రతి గ్రామంలోను సామాజిక సమానత్వం పెంపొందించాలని, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని బిజెపి రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ ఛైర్మెన్ పార్థసారథి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సి.విష్ణువర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125 జయంతిని పురస్కరించుకుని బిజెపి కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ నుండి 24వ తేదీ పంచాయతీ రాజ్ దివస్ వరకు గ్రామ స్వరాజ్ అభియాన్ జరపాలని నిర్ణయించిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని దళితవాడల్లో 10 రోజులపాటు వివిధ స్థాయిల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 14నుండి 17వ తేదీ వరకు దళితవాడల్లో సహపంక్తి భోజనాల కార్యక్రమం, 18 నుండి 20వ తేదీ వరకు ప్రధాని నరేంద్రమోదీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు రైతులకు అందాల్సిన ఆటల్ బీమా యోజన పథకాన్ని రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. పది రోజుల కార్యక్రమంలో భాగంగా 24వ తేదీన తాడిపత్రిలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు కేంద్ర మంత్రి ఒకరు హాజరై ప్రభుత్వ పథకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలలో బిజెపి నాయకులు, కార్యకర్తలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం రైల్వే జోనల్ కమిటీ మెంబర్‌గా ఎన్నికైన ప్రతాప్‌రెడ్డిని, జాతీయ లీగల్‌సెల్ మెంబర్‌గా ఎన్నికైన కె.సుబ్బారావులను బిజెపి నాయకులు శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు జె.అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరెడ్డి, సుదర్శన్, నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు సాకే బలరాం, ప్రతాప్‌రెడ్డి, మల్లీశ్వరీ, రూపా, మల్లారెడ్డి, జగన్‌మోహన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.