అనంతపురం

సమాజసేవలో పరిటాల కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, ఏప్రిల్ 12: సమాజ సేవలో పరిటాల కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి సునీత, ఎంపినిమ్మల, చీఫ్‌విప్ కాలవ, పలువురు ఎమ్మెల్యేలు కొనియాడారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సామూహిక వివాహాల ఏర్పాట్లను ఎంపి నిమ్మల కిష్టప్ప, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పార్థసారధి, ఈరన్న, ఎమ్మెల్సీ తిప్పేస్వామి, జెడ్‌పి చైర్మన్ చమన్‌సాబ్, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మేయర్ స్వరూప తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుమల దేవర ఆలయ ప్రాంగణానికి వచ్చి పెళ్లిళ్ల నిర్వహణపై మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌తో కలిసి చర్చించారు. పెళ్లి పందిర్లు వేయడం, భోజనశాల, ముఖ్యమంత్రి వచ్చే రహదారి, సభాస్థలి, పరిటాల రవీంద్ర విగ్రహం ఏర్పాటుచేసే స్థలాన్ని పరిశీలించారు. జరుగుతున్న పనులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 8 రోజులు మాత్రమే సమయం వుండడంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అనంతరం వీరు విలేఖరులతో మాట్లాడుతూ పరిటాల రవీంద్ర ఆశీస్సులతో జరుగుతున్న ఉచిత సామూహిక వివాహాలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18వరకు కొత్త జంటల పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుందని, ఇంకా ఎవరైనా వుంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోవచ్చునన్నారు. సమజా సేవ, సాంఘీక సేవ చేయడంలో పరిటాల కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, వీరికి మనమందరం చేయూతనిద్దామన్నారు. సామూహిక వివాహాలు నిర్వహించడం అంత ఆషామాషీ కాదని, పెళ్లి కుమారుడు, కుమార్తెకు కొత్త బట్టల నుండి ఓ కుటుంబానికి అవసరమైన పెట్టె, వంట వస్తువులు అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా ఇంటి నుండి ఒడి బియ్యంతో వచ్చి సాంప్రదాయబద్ధంగా పెళ్లిళ్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరిటాల రవీంద్ర ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ పెళ్లిళ్లు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ పెళ్లిళ్లకు ప్రతి ఒక్కరూ వచ్చి నూతన వధూ వరులను ఆశీర్వదించాలని వారు కోరారు. మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్‌లు మాట్లాడుతూ ఉచిత సామూహిక వివాహాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారని, అందరూ వచ్చి ఆశీర్వదించాలని కోరారు. పరిటాల రవీంద్ర రెండు పర్యాయాలు, తాము ఒక పర్యాయం ఇప్పుడు రెండో పర్యాయం పెళ్లిళ్లు నిర్వహిస్తున్నామని, మా ఇంటిలో మా కూతరు పెళ్లి చేసిన విధంగానే సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో మేయర్ స్వరూప, ఆలం నరసానాయుడు, ఎల్.నారాయణచౌదరి, పరిటాల మహేంద్ర, రామ్మూర్తినాయుడు, గజ్జలప్ప పాల్గొన్నారు.