అనంతపురం

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఏప్రిల్ 12 : మండల పరిధిలోని వైబి హళ్లి గ్రామానికి చెందిన రామప్ప (45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. వైబి హళ్లికి చెందిన రామప్ప గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతుండేవాడు. దీంతో మూడు రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భార్య, పిల్లలు ఇంట్లో లేకుండటంతో ఎవరూ గమణించలేదు. మూడు రోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు కిటికీలో నుంచి చూడగా రామప్ప శవంగా వేలాడుతుండటంతో గమణించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై మక్బూల్ బాషా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.