అనంతపురం

గ్రామాభివృద్ధే టిడిపి ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఏప్రిల్ 16: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శనివారం పుట్టపర్తి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా సా తర్లపల్లి, గంగిరెడ్డిపల్లితండా, దిగు వ చెర్లోపల్లి, బుగ్గపల్లి, మార్లపల్లి, రాచువారిపల్లి, పెడబల్లి తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా రూ.60 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ చంద్రన్న బాట కింద రాష్ట్ర వ్యాప్తంగా 29 వేల కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో, ఆయా గ్రామాల్లో అంతర రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలు 50 యూనిట్లకు తక్కువ విద్యుత్ వినియోగించే వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు కృతనిశ్చయంతో వున్నామన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారానికి రూ.14 కోట్లతో ప్రాజెక్టును అమలులోకి తెచ్చామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడుతూ గ్రామాల్లో వేసవిలో ఎటువంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. పశు వైద్యాధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరవు కాలంలో అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.150 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. సుమారు 1000 రోడ్లను నిర్మిస్తున్నామన్నారు.
పెడబల్లితండాలో పల్లె నిద్ర...
మండల పరిధిలోని పెడబల్లితండాలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి శనివారం పల్లె నిద్ర చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా 34 ఎస్‌సి కాలనీల్లో తాము పల్లె నిద్ర చేశామన్నారు. తండావాసుల అనేక సమస్యలను పల్లె నిద్ర ద్వారా తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు.