అనంతపురం

సోలార్ ప్రాజెక్టు పనులు పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంబులపూలకుంట, ఏ ప్రిల్ 16: మండలంలో ఎన్‌టిపిసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న ఆల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్ పనులను శనివారం ఎస్‌పి రాజశేఖర్‌బాబు పరిశీలించారు. 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో ముందస్తుగా ఏర్పాట్లను పరిశీలించడానికి ఎస్పీ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెల చివరిలోగా 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పనులను ప్రారంభించడం జరిగే అవకాశాలు వున్నాయన్నారు. పిఎం, సిఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఎన్‌టిపిసి అధికారులతో ఎస్‌పి మాట్లాడారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఎక్కడ నిర్వహించే అంశంపై వారితో చర్చించడం జరిగినట్లు తెలిసింది. మూడు జిల్లాల సరిహద్దులో వుండడంతో ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధచూపే అవకాశం లేకపోలేదు. కార్యక్రమంలో ఎస్‌పి రాజశేఖర్‌బాబు, డిఎస్‌పి వెంకట రామాంజినేయులు, రూరల్ సిఐ రవికుమార్, సోలార్ ఎడి శివశంకర్‌నాయుడు, ఎన్‌పికుంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.