అనంతపురం

యువతిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఏప్రిల్ 16 : పట్టణంలోని ఓ లాడ్జిలో శుక్రవారం రాత్రి దాదాపు 20 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం రాత్రి పెనుకొండ రొద్దం బాబా పేర లాడ్జిలో రూమును అద్దెకు తీసుకున్నారు. అయితే శనివారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న యువతిని చూసిన లాడ్జి సిబ్బంది 108కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. యువతిపై దాదాపు 12 చోట్ల రక్తగాయాలైనట్లు వైద్యులు తెలిపారు. అయితే గదిని అద్దెకు తీసుకున్న వ్యక్తి పరారయ్యాడు. యువతి అపస్మారకస్థితిలో ఉండటంతో వివరాలు తెలియరాలేదు. కాగా కనీసం ఎలాంటి గుర్తింపు కార్డు కూడా లేకుండా లాడ్జి యజమానులు గదిని అద్దెకివ్వడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.