అనంతపురం

కార్పొరేట్ విద్యాసంస్థలను జాతీయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూలై 17: రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలను జాతీయం చేసి ఫీజుల దోపిడీని అరికట్టాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే నరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ సొసైటీ పేరుతో పది సంవత్సరాలు ఉచిత విద్యను అందిస్తామని రిజర్వేషన్ చేసుకుని ప్రభుత్వాన్ని మోసం చేస్తూ విద్యను వ్యాపారం చేస్తూ ఫీజుల రూపంలో దోపిడీ చేస్తున్నారని, అలాంటి వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు.

విద్యారంగ పరిరక్షణ యాత్ర గోడపత్రిక విడుదల
అనంతపురం కల్చరల్, జూలై 17: ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యారంగ పరిరక్షణ కోసం నేటి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే బస్సు యాత్ర గోడపత్రికను మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రంగస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర యాదవ్ విడుదల చేశారు. మంగళవారం ఆర్ట్స్ కళాశాలలో గోడపత్రిక విడుదల అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి, ప్రైవేటుసంస్థలకు అప్పగిచ్చేందుకు సిద్దమయ్యాయన్నారు. అందులో భాగంగానే యూజీసీ రద్దు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటుసంస్థలకు అప్పచెప్పడం, క్లస్టర్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం, హాస్టళ్లను మూసివేయడం జరుగుతోందన్నారు. బడ్జెట్‌లో విద్యకు సరిపడా నిధులు కేటాయించడం లేదన్నారు. శ్రీకాకుళం నుండి హిందూపురం వరకు జరిగే బస్సు యాత్రలో మేధావులు, కవులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
లక్ష మల్లెపూలతో లలితా సహస్రనామార్చన
అనంతపురం కల్చరల్, జూలై 17: పాతవూరు శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో శ్రీ వాసవీ మహిళా మండలి అధ్యక్షురాలు మేడా అరుణ కుమారి ఆధ్వర్యంలో శ్రీ లలితాదేవికి లక్ష మల్లెపూలతో సహస్ర నామార్చన, మణిద్వీప వర్ణని కార్యక్రమాలు చేశారు. ఆషాడ మాసం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో 300 మంది మహిళలు ధవళవర్ణ చీరలు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ లలితా అమ్మవారికి ఆషాడ మాసం అంటే ఎంతో ప్రీతికరమని, లోకకల్యాణం, విశ్వశాంతి కొరకు శాంతికి చిహ్నమైన తెలుపు రంగు పూలతో అమ్మవారికి అర్చన చేయడం జరిగిందన్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.