అనంతపురం

రైతు జైల్‌భరో కార్యక్రమానికి సీపీఎం మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూలై 17: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, 4, 5 విడతల రుణమాఫీ ఒకేసారి అమలుచేయాలన్న డిమాండ్‌తో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 9న నిర్వహించనున్న రైతు జైల్‌భరోకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలిపింది. పార్టీ కార్యలయంలో మంగళవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో రాంభూపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. నాలుగేళ్లలో రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల్లో కూరుకుపోయారన్నారు. రైతులకు ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం అందించకపోవడంతో నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారన్నారు. దీని ఫలితంగా దేశ వ్యాప్తంగా రైతుల ఉద్యమాలు తీవ్రమైనాయన్నారు. రుణమాఫీ అమలుచేయడంతోనే రైతులకు తక్షణమే ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ఏఐకేఎస్ ఆగస్టు 9న జైల్‌భరోకు పిలుపునిచ్చిందన్నారు. జిల్లాలో రైతులు చేపట్టే కార్యక్రమానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొంటుందన్నారు.
గిడ్డంగుల్లోని ధాన్యం వేలం అన్యాయం
రైతులు కష్టపడి పండించిన పప్పుశనగ, ధనియాలను వేలం వేస్తామంటూ బ్యాంకు అధికారులు ప్రకటించడం అన్యాయమని రాంభూపాల్ పేర్కొన్నారు. ఉరవకొండ ప్రాంతంలో శీతల గిడ్డంగుల్లో రైతులు తమ ధాన్యాన్ని ఉంచుకున్నారన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో గిడ్డంగుల్లో ఉంచిన రైతులు బ్యాంకుల నుండి కొంత అప్పు తీసుకున్నారన్నారు. అప్పు ఇచ్చిన బ్యాంకులు ధాన్యాన్ని వేలం వేస్తామంటూ ప్రకటన జారీ చేయడం అన్యాయమన్నారు. దీనిపై అధికార యంత్రాంగం స్పందించాలన్నారు.

ఏపీ డీఎంపీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
అనంతపురం సిటీ, జూలై 17: కరవు నివారణ కార్యాచరణ ప్రణాళికలో ఏపీడీఎంపీ పథకం అమలులో గ్రామస్థాయిలోని నివసించే ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ సలహాదారు, రిటైర్డు ఐఏఎస్ పి.విజయకుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉప్పరపల్లి రోడ్డు సమీపంలోని ఎకాలజీ సెంటరునందు జిల్లా ఆత్మ ఆధ్వర్యంలో కరవు నివారణ పథకం అమలుతీరుపై ఏపి డ్రాప్ట్‌మేటిగేషన్ ప్రాజెక్టు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. ఈ సదంర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఏపీడీయంపీ పథకం ద్వారా రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాతో కలసి 1.65 లక్షల మంది రైతుల ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు ఈ పథకం ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ పథకం అమలుపై ప్రజలకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కరవు నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రణాళికలు చేపట్టాలని తెలిపారు. ప్రతి క్లస్టరులో నిరుపేదలను గుర్తించి వారి జీవన ప్రమాణస్థాయిలను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 జిల్లాల్లో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. సేద్యపు రంగంలో వినూత్న ఆలోచనలు, సరికొత్త పద్దతులను పాటించేందుకు రైతులు ముందుకువస్తే వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఏపీడీఎంపీ పథకంను పటిష్టంగా అమలుచేయుచున్నామని, కరవు నివారణకు సంబందిత శాఖాధికారులకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్దేశాలను సూచించడం జరిగిందని తెలిపారు. ఉత్పతులు, విక్రయాల సమయంలో పంట నష్టపోయిన రైతులకు ఉపయోగపడేలా ఈ-క్రాప్ బుకింగ్ ప్రవేశపెడుతున్నామన్నారు. అదేవిధంగా ఆధార్ అనుసంధానంతో రాయితీ విత్తనాలు, ఎరువులను రైతులకు అందజేయుచున్నామని తెలిపారు.