అనంతపురం

సమస్యల పరిష్కారానికే ‘గ్రామదర్శిని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం, జూలై 17 : ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే ప్రభుత్వం గ్రామదర్శిని కార్యక్రమం చేపట్టిందని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం పట్టణంలోని 15వ వార్డులో వార్డుదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యల ఏకరువు పెట్టారు. ముఖ్యంగా తమ వార్డు కౌన్సిలరు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డు, డ్రైనేజీ సమస్యలు వేధిస్తున్నాయని వివరించారు. రోడ్డుకు అడ్డంగా విద్యుత్ స్తంభం నాటినా పట్టించుకోవడం లేదన్నారు. మురికినీరు ఎక్కడికక్కడే ప్రవహిస్తుండటం వల్ల రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అందుకోసమే వార్డుదర్శిని కార్యక్రమం చేపట్టామన్నారు.
బొమ్మనహాల్‌లో...
బొమ్మనహాల్ : మండల పరిధిలోని ఉప్పరాళ్ల గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్‌బీ నగర్‌లోని దళితవాడ, బీసీ కాలనీ మధ్య లింక్ సీసీ రోడ్డుకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో రూ.500 కోట్లతో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ ఇచ్చామన్నారు. గత పదేళ్లలో చేయని అభివృద్ధి నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారన్నారు. ఒంటరి మహిళ, హిజ్రాలకు సైతం పింఛన్లు అందించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. అలాగే జిల్లాలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు, పేరూరు డ్యాం, బీటీపీకి కృష్ణాజలాల మళ్లింపు, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు కృష్ణానిధులు అందించి తాగు, సాగునీటి సమస్యలు తీర్చామన్నారు. ఇంత తక్కువ సమయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదన్నారు. తక్కువ లోటు బడ్జెట్‌ను అధిగమించి బ్రాహ్మణులు, బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించాల్సిన నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర బడ్జెట్‌నే పెంచుకుని సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.