అనంతపురం

గాలి దుమారం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 17 : ఓవైపు నైరుతి రుతుపవనాలు కరుణించక పోవడం, మరోవైపు నేల లోపల ఉన్న తేమ సైతం ఆవిరై పోతుండటంతో కంగారు పడుతున్న రైతులకు గత కొన్ని రోజులుగా గాలి దుమారం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గడచిన ఐదు రోజులుగా జిల్లాలో గాలి వేగం పెరిగింది. దీంతో వచ్చే వర్షం కూడా ఎక్కడ రాకుండా పోతుందోనన్న బెంగ రైతుల్లో నెలకొంది. మరోవైపు గాలికి దుమ్మూధూళీ పడుతుండటంతో వాహన చోదకులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల్లో మైదాన ప్రాంతాలు, వర్షాధారం పంట సాగు చేసే భూముల్లో గాలి వేగానికి దుమ్ము పైకి లేస్తోంది. రోడ్లపై వాహనాలు నడపలేని పరిస్థితి నెలకొంది. మంగళవారం కనీసం 23 కి.మీ. వేగంతో గాలి వీచినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు ఉష్ణోగ్రతలు కూడా గరిష్ఠంగా 31 నుంచి 33.6, కనిష్ఠంగా 24 నుంచి 25 సెల్సియస్ డిగ్రీల వరకు నమోదవుతోంది. గడచిన ఐదు రోజుల్లో వాయువేగం కూడా కనిష్ఠంగా 18 నుంచి 23.6 కి.మీ. ఉంది. దీంతో గాలిలో తేమ ఉదయం గరిష్ఠంగా 82 శాతం ఉండగా, కనిష్ఠంగా 68 శాతం ఉంటోంది. అదే మధ్యాహ్నం సమయానికి 45 నుంచి 42 శాతానికి పడిపోతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగానే ఉంటున్నాయి. రానున్న ఐదు రోజుల్లో కాస్తా తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు 22 కి.మీ. నుంచి 19 కి.మీ. వేగం ఉండొచ్చని అంచనా. తేమ శాతం కూడా గరిష్ఠంగా 77-75 మధ్య ఉదయం పూట, 61-64 శాతం మధ్య మధ్యాహ్నం సమయంలో ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 34, కనిష్ఠంగా 25 సెల్సియస్ డిగ్రీలు ఉండవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో 18వ తేదీ జిల్లాలో ఒక మాదిరి (8.-13 మీ.మీ.) వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ నివేదికను అనుసరించి రేకులకుంట వ్యవసాయ పరిశోధన సంస్థ అధికారులు వెల్లడించారు.
రైళ్లలో వరుస చోరీలతో భీతిల్లుతున్న ప్రయాణికులు
తాడిపత్రి, జూలై 17: గుంతకల్లు రైల్వే డివిజన్‌లో రైళ్లలో వరుస చోరీలతో ప్రయాణికులు భీతిల్లుతున్నారు. రైలు ప్రయాణమంటే అమ్మో అంటు హడలెత్తుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటకలలోని వివిధ ప్రాంతాలలో, గుంతకల్లు రైల్వే డివిజన్‌లో గార్లదినె్న, పామిడి, జూటూరు, జక్కలచెరువు, వంగనూరు, వేములపాడులలో రోజుల వ్యవధిలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ రైల్వే పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రైల్వే లైన్ల ఆధునీకరణలో రైల్వే సిబ్బందితోపాటు బయటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగులతో రైల్వే ట్రాక్ ఆధునీకరణ పనులు చేపట్టారు. మహారాష్టల్రోని షోలాపూర్ జిల్లాలోని మహల్ గ్రామానికి చెందిన పార్థీ గ్యాంగ్‌లో టెక్నికల్ విభాగానికి చెందిన కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు చేరారు. వారు నైపుణ్యంతో అవుట్‌స్కట్‌లో సిగ్నల్ పోల్ ఎక్కి సిగ్నల్ లాక్ తొలగించి సిగ్నల్ కేబుల్స్‌ను కట్ చేస్తారు. అంతకుమునుపే రైల్వే ట్రాక్ పక్కన రోడ్డున్న ప్రాంతాన్ని పార్థీ గ్యాంగ్ రెక్కీ నిర్వహించి, ట్రాక్ ఇరువైపుల రాళ్లను కుప్పలుగా పోసి సిగ్నల్స్ కేబుల్స్‌ను కట్ చేయగానే, సిగ్నల్ అందకపోవడంతో రైలు ఆగగానే రైలు బోగిలపై రాళ్ళతో దాడి చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసి దొంగతనాలకు పాల్పడుతారు. సంవత్సర కాలంలో పది నెలలు దొంగతనాలకు పాల్పడి కేవలం రెండు నెలలు మాత్రమే పార్థీ గ్యాంగ్ కుటుంబ సభ్యులతో గడుపుతారు. 2016లో జైలుశిక్షను అనుభవించి బయటకు వెళ్ళిన పార్థీ గ్యాంగ్‌లో దాదాపు 30మంది సభ్యులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అనంతపురం సెంట్రల్ జైల్‌లో పార్థీ గ్యాంగ్ సభ్యుడు జగన్ శిక్ష అనుభవిస్తున్నాడని సమాచారం. వరుస రైలు దొంగతనాలకు అరికట్టేందుకు జీఆర్‌పీ సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా తలెత్తుతుంది.