అనంతపురం

మాధవ్.. దమ్ముంటే నా నాలుక కోయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 21 : అనంతపురం పోలీసు సంఘం అధికారులపై ఎంపీ జేసీ.దివాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తాను పోలీసులు కొజ్జాలు అనడం తప్పని నిరూపిస్తే బాధపడిన ఎవరినైనా క్షమించమని అడిగి పాదాభివందనం చేస్తానంటూ స్పష్టం చేశారు. తాడిపత్రి మండలం ప్రబోధానంద ఆశ్రమం, చిన్నపొలమడ గ్రామస్థుల మధ్య చోటు చేసుకున్న విధ్వంసకర ఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురువారం విలేఖరుల సమావేశంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శుక్రవారం అనంతపురంలోని తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఎంపీ విరుచుకుపడ్డారు. తనపై సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు.‘ఏయ్.. మాధవ్.. దమ్ముంటే నా నాలుక కోయ్.. నాపైనే మీసాలు తిప్పుతావా? సినిమాలో సాయికుమార్‌లాగా చేద్దామనుకుంటున్నావా? అది సినిమా, ఇది లైఫ్.. నీ అంతు చూస్తాను’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఎక్కడికి రమ్మంటావు? నీ పోలీసు స్టేషన్‌కా, నీ ఇంటికా.. నీ సొంతూరుకా.. కడపకా? లేక అనంతపురం టవర్ క్లాక్ వద్దకా? అంటూ సవాల్ విసిరారు. నీవు నన్ను బెదిరించేంతటి మగాడివయ్యావా? నా చుట్టూ నువ్వు ఎన్నిసార్లు తిరిగావో నాకు గుర్తులేదు..అది నువ్వు మర్చిపోకు.. ఈ నెల 25వ వరకు అనంతపురంలోనే ఉంటా.. నువ్వు డ్రస్ తీసేసి రా.. నేనూ సాధారణ దుస్తుల్లో వస్తా.. తేల్చుకుందాం.. నీ కత్తికి పదును లేకుంటే పెట్టుకో..’ అంటూ సవాల్ విసిరారు. ప్రబోధానంద శిష్యులు విచక్షణారహితంగా దాడులు చేస్తుంటే చేష్టలుడిగిన పోలీసులు కనీసం గాలిలోకి అయినా కాల్పులు జరపకుండా పారిపోయారని, తనకు కూడా రక్షణ లేకుండా పోవడంతో తాను కూడా పారిపోవాల్సి వచ్చిందని అన్నారు. ఆ సమయంలో పోలీసులు సరిగా వ్యవహరించకపోవడం వల్లే కొజ్జాలని తాను అన్నానన్నారు. కొజ్జా అనే మాట తప్పా.. మీరే చెప్పండి.. అంటూ మీడియాను ప్రశ్నించారు. తాను రాయలసీమలో పుట్టాను.. పెరిగాను.. ఇక్కడి పదజాలమే వాడాను.. దాన్ని మీ ఇష్టమొచ్చినట్లు అన్వయించుకోవడమేమిటి? కాగా ఘర్షణ సమయంలో విధుల్లో ఉన్న వారిని ఉద్దేశించే తాను ఆ మాట అన్నానని, ఏ ఒక్కరినో ప్రత్యేకించి అనలేదని సమర్థించుకున్నారు. పోలీసులు కొజ్జాలని, తాను కూడా కొజ్జానే..అని, ఎందుకంటే వారితోపాటు నేనూ పారిపోయాను అని ఎంపీ అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని, మరో ఆరు నెలల్లో తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్న సమయంలో ఇలాంటి పరిస్థితి రావడం తన దౌర్భాగ్యమని అన్నారు. పోలీసు అధికారులు ఇలా రెచ్చిపోవడానికి వెనుక కొందరు రాజకీయ నాయకులు ఉన్నారని ఆయన ఆరోపించారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ మేరకు పోలీసులకు అసోసియేషన్ ఏర్పాటు చేసుకునే హక్కు లేదని అన్నారు. ఈ రోజు నా నాలుక కోస్తాననన్నారు.. రేపు ఇంకో రాజకీయ నాయకుడి నాలుక కోస్తారు.. అందరికీ అసోసియేషన్లు ఉన్నాయి? ఎంపీలు, ఎమ్మెల్యేలకే సంఘాలు లేవు.. ఆలోచించుకోండి.. అంటూ సూచించారు. తాడిపత్రి ఘటనల్లో స్థానిక పోలీసుల వైఫల్యాలను గుర్తించి అక్టోపస్ బలగాలను పంపి, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉన్నతాధికారులకు కృతజ్ఞతలన్నారు.