అనంతపురం

రోడ్లు, భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, సెప్టెంబర్ 21 : రాప్తాడు నియోజకవర్గంలో ఇంకా పెండింగ్‌లో వున్న రోడ్లు, భవన నిర్మాణాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రామగిరిలోని గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో రోడ్ల పనులు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు రూ.30 కోట్లు విలువ చేసే సీసీ రోడ్లు, తారురోడ్ల పనులు పూర్తయ్యాయని, మరో రూ.80 కోట్లు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వీటి నిర్మాణ బాధ్యత పూర్తిగా అధికారులే తీసుకోవాలని, ఎక్కడైనా భవన నిర్మాణాలకు స్థల సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు. డిసెంబర్ నెలాఖరుకల్లా ఈ పనులను పూర్తి చేయాలన్నారు. పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. 70 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి నోచుకోలేదని, త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఐసీడీఎస్ పీడీతో మంత్రి సమీక్ష
ఈ మధ్య అంగన్‌వాడీ కేంద్రాలలో కోడిగుడ్లు చిన్నవిగా వస్తున్నాయని కొన్నిచోట్ల నిర్వహణ సరిగా లేదని మంత్రి దృష్టికి రావడంతో ఆమె శుక్రవారం పీడీ చిన్మయదేవితో సమీక్ష నిర్వహించారు. కేంద్రాలకు వచ్చే కోడిగుడ్లు తూకం వేసి తీసుకోవాలని ఒక్కొక్క గుడ్డు 40 నుండి 50 గ్రాములు వుండాలని, నాణ్యత లేని వాటిని వెనక్కి పంపాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, కోడిగుడ్లు పంపిణీపై సీడీపీఓలు తనిఖీలు చేస్తుండాలన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు.

ఆటో పంపిణీ
కాపు రుణ మేళాలో రుణం పొంది ఆటో తెచ్చుకున్న యువకుడికి స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత చేతులమీదుగా శుక్రవారం వెంకటాపురం గ్రామంలో పంపిణీ చేశారు. చెనే్నకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన ప్రసాద్ కాపు కార్పొరేషన్ ద్వారా రూ.2 లక్షలు, ప్రభుత్వ సబ్సిడీ రూ.లక్షతో ఆటో తెచ్చుకున్నాడు. నిరుద్యోగ యువతకు కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతో ఆసరా కల్పించడం జరుగుతోందన్నారు. ఆమె ఆటో ఎక్కి కాస్త దూరం ప్రయాణం చేశారు.